న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యాషెస్‌లో 4వ టెస్టు: ఆస్ట్రేలియా బ్యాటింగ్, స్మిత్ ఈజ్ బ్యాక్

 England vs Australia Ashes 2019 Live Score 4th Test Day 1: Tim Paine wins the toss and Australia will BAT first

హైదరాబాద్: ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరిస్‌లో ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభమైంది. మాంచెస్టర్‌లోని ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. రెండో టెస్టులో ఆర్చర్‌ బౌన్సర్‌కు గాయపడి మూడో టెస్టుకు దూరమైన స్టీవ్‌ స్మిత్‌ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు.

 సముద్ర తీరాన ధావన్ వేణుగానం.. అభిమానులు ఫిదా (వీడియో)!! సముద్ర తీరాన ధావన్ వేణుగానం.. అభిమానులు ఫిదా (వీడియో)!!

మరోవైపు ఈ సిరిస్‌కు ఎంపిక అయినప్పటికీ ఈ పర్యటనలో ఇప్పటివరకు మిచెల్ స్టార్క్ ఒక్క మ్యాచ్ కూడా అడలేదు. అయితే, నాలుగో టెస్టులో పీటర్ సిడ్డిల్ స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ మిచెల్ స్టార్క్‌ను తుది జట్టులో ఎంపిక చేసింది. ఆతిథ్య జట్టు కూడా ఒక మార్పుతో బరిలోకి దిగింది. క్రిస్ వోక్స్ స్థానంలో గ్రెయిగ్ ఓవర్టన్‌ను తుది జట్టులోకి వచ్చాడు.

ఐదు టెస్టుల యాషెస్ సిరిస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించగా... లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక, ఉత్కంఠభరితంగా సాగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించడంతో సిరీస్‌ను సమం అయింది. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.

1
44041

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తే గత సిరీస్‌ విజేత అదే కాబట్టి ట్రోఫీ ఆసీస్ సొంతమవుతుంది. దీంతో చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ నెగ్గినా ఎటువంటి ప్రయోజనం ఉండదు.

జట్ల వివరాలు
ఆస్ట్రేలియా:
డేవిడ్ వార్నర్, మార్కస్ హారిస్, మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మాథ్యూ వేడ్, టిమ్ పైన్(కెప్టెన్, వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జోష్ హాజిల్‌వుడ్

ఇంగ్లాండ్: రోరే బర్న్స్, జో డెన్లీ, జో రూట్ (కెప్టెన్), జాసన్ రాయ్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, క్రెయిగ్ ఓవర్టన్, స్టువర్ట్ బ్రాడ్, జాక్ లీచ్

Story first published: Wednesday, September 4, 2019, 15:25 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X