న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Joe Root Records: సచిన్ రికార్డు బద్ధలు కొట్టే రూట్‌లో జో రూట్.. ఏడాదిన్నరలో 10 సెంచరీల మోత

England Star Joe Root has scored 10centuries in Tests since January 2021

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ జో రూట్ తన గొప్ప ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. నాటింగ్ హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జి స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సెంచరీ చేసి.. వరుసగా రెండు టెస్టుల్లో శతకాలు సాధించాడు. ఇక 2021 జనవరి నుంచి అతను 10వ సెంచరీలు నమోదు చేశాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ డారిల్ మిచెల్ (190పరుగులు), టామ్ బ్లండెల్ (106పరుగులు) సెంచరీలతో రాణించడంతో 553పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ సైతం అంతే దీటుగా బ్యాటింగ్ చేసింది. ఇక కెరీర్లో తన రెండో టెస్ట్ సెంచరీని నమోదు చేసిన ఆలీ పోప్ (145)తో కలిసి రూట్‌ మూడో రోజు 187పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

అలాగే కెప్టెన్ బెన్ స్టోక్స్ (46పరుగులు) కలిసి 61పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రూట్ 3వ రోజు ఆట ముగిసేసమయానికి 200బంతుల్లో 163 ​​పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో 3వ రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ 5వికెట్లు కోల్పోయి 473పరుగులు చేసింది. ఇక నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన తర్వాత కాసేపటికే రూట్ (176పరుగులు 211బంతుల్లో 26ఫోర్లు 1సిక్సర్) ఔటయ్యాడు. ఇక వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (56పరుగులు 104బంతుల్లో 10పరుగులు) రనౌట్ అవుట్ అవడంతో ఇంగ్లాండ్ టెయిల్ ఎండర్లు బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేదు.

ఏడాదిన్నర కాలంలోనే 10 సెంచరీలు

ఇక రూట్ టెస్టుల్లో ఆల్ టైం గ్రేట్ ప్లేయర్‌గా తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతను 2021 నుంచి టెస్టుల్లో అదరగొడుతున్నాడు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే 10సెంచరీలు చేశాడు. అతను 1. 228 vs శ్రీలంక, 2. 186 vs శ్రీలంక, 3. 218 vs భారత్, 4. 109 vs భారత్, 5. 180* vs భారత్, 6. 121 vs భారత్, 7. 109 vs వెస్టిండీస్, 8. 153 vs వెస్టిండీస్, 9. 115* vs న్యూజిలాండ్, 10. 176 vs న్యూజిలాండ్ సెంచరీలతో రాణించాడు.

టెస్టుల్లో అత్యధిక పరుగులు వీరుడయ్యేలా

ఇక 2021 నుంచి రూట్ మొత్తం 23 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో 42 ఇన్నింగ్స్‌లలో 2368 పరుగులు చేశాడు. అతని సగటు - 59.2గా ఉంది. ఇందులో 10సార్లు సెంచరీలు చేయడంతో పాటు అందులో 4సార్లు హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. సెంచరీల్లో రెండు డబుల్ సెంచరీలు, నాలుగు సార్లు 150 ప్లస్ స్కోర్లు ఉండడం గమనార్హం. ఇక తన కెరీర్లో 119టెస్టులు ఆడిన రూట్ 219 ఇన్నింగ్స్‌లలో 10191పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 254 కాగా.. సగటు 50.20గా మెయింటెన్ చేశాడు. ఇక 27సెంచరీలు, 5డబుల్ సెంచరీలు, 53హాఫ్ సెంచరీలు రూట్ నమోదు చేశాడు. ఇక టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును రూట్ బద్ధలు కొట్టే అవకాశాలున్నాయి.

 స్టన్నింగ్ సిక్స్ బాదిన జో రూట్

స్టన్నింగ్ సిక్స్ బాదిన జో రూట్

ఇంగ్లాండ్ నాలుగో రోజు బ్యాటింగ్ దిగగా క్రీజులో జో రూట్ ఓ స్టన్నింగ్ సిక్స్ బాదాడు. టెస్టుల్లో రివర్స్ స్వీప్‌లో అది కూడా పేస్ బౌలింగ్లో కొట్టి ఆశ్చర్యపరిచాడు. అతను సౌథీ బౌలింగ్లో ఈ చూడచక్కని సిక్స్ బాదాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 539పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్‌కు 14పరుగుల ఆధిక్యం లభించింది. ఇక ఇంకా ఈ రోజు రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. రేపు ఒక రోజు మొత్తం ఆటకు అవకాశముంది. దాదాపు డ్రా అయ్యే అవకాశముంది.

స్కోరు సమ్మరీ

న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ - 553/10

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ - 539/10

Story first published: Monday, June 13, 2022, 17:52 [IST]
Other articles published on Jun 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X