న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన మూడు ప్రపంచకప్‌ల విన్నర్‌!!

England spinner Laura Marsh retires from international cricket

లండన్‌: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ జట్టు స్టార్‌ స్పిన్నర్‌ లౌరా మార్ష్‌ సోమవారం ప్రకటించారు. 13 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో లౌరా మార్ష్‌ 217 వికెట్లు పడగొట్టారు. 2006లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా మార్ష్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. అయితే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆమె పేస్ బౌలింగ్ చేశారు. అనంతరం స్పిన్నర్‌గా మారారు.

భారత్‌తో సిరీస్‌: లబుషేన్‌కు చోటు.. ఆస్ట్రేలియా జట్టు ఇదే!!భారత్‌తో సిరీస్‌: లబుషేన్‌కు చోటు.. ఆస్ట్రేలియా జట్టు ఇదే!!

 వన్డే ప్రపంచకప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌:

వన్డే ప్రపంచకప్‌లో లీడింగ్‌ వికెట్‌ టేకర్‌:

లౌరా మార్ష్‌ ఇంగ్లీష్ మహిళా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్పిన్నర్. అంతేకాదు ఇంగ్లండ్‌ తరఫున వన్డేలో అత్యధిక వికెట్లు తీసిన మూడవ బౌలర్‌ కూడా. మార్ష్‌ తన 13 ఏళ్ల కెరీర్‌లో ఇంగ్లండ్‌ సాధించిన చిరస్మరణీయమైన విజయాల్లో పాలుపంచుకున్నారు. 2009 మహిళల వన్డే ప్రపంచకప్‌ గెలిచిన ఇంగ్లండ్‌ జట్టులో కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీలో మార్ష్‌ అత్యధికంగా 16 వికెట్లు తీశారు.

 13 ఏళ్ల కెరీర్‌లో 217 వికెట్లు:

13 ఏళ్ల కెరీర్‌లో 217 వికెట్లు:

2009లోనే జరిగిన ప్రపంచకప్‌ టీ20ని ఇంగ్లండ్‌ గెలవగా.. మార్ష్‌ ఆ జట్టులో సభ్యురాలు. ఇక 2017లో ఇంగ్లండ్‌ మహిళలు గెలిచిన వన్డే ప్రపంచకప్‌లో కూడా మార్ష్‌ భాగమమయ్యారు. 9 టెస్టులు, 103 వన్డేలు, 67 టీ20లు ఆడిన మార్ష్‌.. మొత్తంగా 217 వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. వన్డేల్లో 15 పరుగులకు 5 వికెట్లు తీసి అద్భుత గణాంకాలు నమోదు చేశారు. అలాగే టీ20లో 3/12 గణాంకాలు ఉన్నాయి.

అత్యుత్తమ బౌలర్లలో మార్ష్‌ ఒకరు:

అత్యుత్తమ బౌలర్లలో మార్ష్‌ ఒకరు:

మార్ష్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పడంపై ఇంగ్లండ్‌ మహిళా క్రికెట్‌ డైరక్టర్‌ క్లార్‌ కానోర్‌ స్పందించారు. 'ఇంగ్లండ్‌ క్రికెట్‌ చరిత్రలోని అత్యుత్తమ బౌలర్లలో లౌరా మార్ష్‌ ఒకరు. రికార్డులే ఆమె అంకిత భావాన్ని చూపెడతాయి. లౌరాతో ఆడిన క్రికెటర్లందరికీ ఆమె ఎంతలా శ్రమిస్తారో తెలుసు. దాంతోపాటు నిజాయితీ, దయాగుణం, నేర్చుకోవాలనే తపన ఆమెను ఉన్నత స్థానంలో నిలబెట్టాయి' అని పేర్కొంది.

 క్రికెట్‌కు ఓ రోల్ మోడల్:

క్రికెట్‌కు ఓ రోల్ మోడల్:

'లౌరా మార్ష్‌తో కలిసి పనిచేసిన వారు ఆమెను ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ప్రపంచంలో చాలా మంది క్రికెటర్లు మూడు ప్రపంచకప్‌లు గెలవలేదు. కొందరిలో మార్ష్‌ కూడా ఉన్నారు. మార్ష్‌ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పినా.. ఆమె తరపున అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆమె పూర్తిగా టీమ్ ప్లేయర్. ఇంగ్లాండ్ మహిళల క్రికెట్‌కు ఓ రోల్ మోడల్' అని కానోర్‌ అన్నారు.

Story first published: Tuesday, December 17, 2019, 13:49 [IST]
Other articles published on Dec 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X