న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దానికి ఇంకా చాలానే సమయముంది: అండర్సన్

England spearhead James Anderson not considering retirement yet

హైదరాబాద్: ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొని తమ జట్టు సత్తా చూపిస్తామని బయల్దేరిన టీమిండియా నైరాశ్యంతో తిరుగుముఖం పట్టింది. అయితే ఈ విజయంతో ఇంగ్లాండ్
గెలుపు సంబరాల్లో మునిగి తేలుతోంది. ఇదిలా ఉంటే టీమిండియాతో ఆఖరి మ్యాచ్ ఆడి వీడ్కోలు చెప్పేశాడు అలెస్టర్ కుక్. మరి జేమ్స్ అండర్సన్ ఇదే విషయమై ప్రశ్నిస్తే.. క్రికెట్‌కు ఇప్పట్లో వీడ్కోలు పలికే ఉద్దేశం తనకు లేదని ఇంగ్లాండ్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ అంటున్నాడు.

మెక్‌గ్రాత్‌ 563 రికార్డును బద్దలు

మెక్‌గ్రాత్‌ 563 రికార్డును బద్దలు

టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆస్ట్రేలియా పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ను దాటేసిన సందర్భంగా అతడు మీడియాతో మాట్లాడాడు. టీమిండియాతో ఐదో టెస్టులో మొహమ్మద్‌ షమీని ఔట్‌ చేయడంతో జిమ్మీ ఖాతాలో 564 వికెట్లు జమ అయ్యాయి. దీంతో మెక్‌గ్రాత్‌ 563 రికార్డును బద్దలు కొట్టాడు. అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా అవతరించాడు. ముత్తయ్య మురళీధరన్‌ (800 వికెట్లు), షేన్‌ వార్న్‌ (708), అనిల్‌ కుంబ్లే (619) రికార్డులపై కన్నేశాడు.

ఇంగ్లాండ్‌ విజయాలపైనే నా దృష్టంతా

ఇంగ్లాండ్‌ విజయాలపైనే నా దృష్టంతా

వ్యక్తిగత రికార్డు కన్నా చివరి టెస్టులో ఇంగ్లాండ్‌ను గెలిపించడం పైనే తాను ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు అండర్సన్‌ తెలిపాడు. ‘నా కెరీర్‌ ముగిసిన తర్వాత కూర్చొని ఆలోచిస్తే నేను ఏం సాధించానో చూడగలగాలి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ విజయాలపైనే నా దృష్టంతా' అని జిమ్మీ అన్నాడు. తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన అలిస్టర్‌ కుక్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.

 మీరింకెన్నాళ్లు ఆడతారనే ప్రశ్నకు

మీరింకెన్నాళ్లు ఆడతారనే ప్రశ్నకు

ఈ సందర్భంగా మీరింకెన్నాళ్లు ఆడతారనే ప్రశ్నకు ‘దాని గురించి ఇంకా ఆలోచించడం లేదు. బాగా దృష్టి పెట్టినప్పుడు అద్భుతంగా ఆడతా. నా మదిలో ఎప్పుడూ తర్వాతి మ్యాచ్‌, తర్వాతి సిరీస్‌పైనే ఆలోచన ఉంటుంది. 2006 యాషెస్‌ను‌ మెక్‌గ్రాత్‌ వీడ్కోలు ఆలోచన లేకుండా ఆడాడు. సిరీస్‌ పూర్తికాగానే తనకు సమయం ఆసన్నమైందని భావించాడు. వెంటనే వీడ్కోలు ప్రకటించాడు. ఎవరికి తెలుసు నాకూ అలానే కావొచ్చేమో' అని అండర్సన్‌ అన్నాడు.

గెలుపోటముల ఆధారంగా విమర్శలా:

గెలుపోటముల ఆధారంగా విమర్శలా:

ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ని భారత్ జట్టు 1-4తో చేజార్చుకుందంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీటిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఐదు టెస్టుల ఈ సిరీస్‌లో భారత్ జట్టు పోరాడినా.. అభిమానులు దాన్ని మరిచిపోయి కేవలం గెలుపోటముల ఆధారంగా విమర్శలు గుప్పించడం తగదని కోహ్లీ సూచించాడు. ఓవల్ వేదికగా మంగళవారం చివరి టెస్టు ముగియగా.. 464 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 345 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Thursday, September 13, 2018, 13:15 [IST]
Other articles published on Sep 13, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X