న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

England Palying XI: డేవిడ్ మలాన్ ఔట్.. క్రిస్ వోక్స్ డౌట్! వెస్టిండీస్‌తో బరిలోకి దిగే ఇంగ్లండ్ జట్టు ఇదే!

 England Playing 11 vs West Indies T20 World Cup 2021: Dawid Malan Out And Chris Woakes Doubt

England Palying XI for West Indies T20 world Cup match: టీ20 ప్రపంచకప్ క్వాలిఫికేషన్ మ్యాచ్‌లు ముగియడంతో నేటి(శనివారం) నుంచి అసలు సిసలు సమరానికి తెరలేవనుంది. సూపర్-12 మ్యాచ్‌లతో అభిమానులకు కావాల్సిన మజా లభించనుంది. గ్రూప్‌ 2లో భాగంగా సాయంత్రం 7.30కు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెస్టిండీస్‌, రన్నరప్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. గత (2016) టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్లో బ్రాత్‌వైట్‌ విధ్వంసంతో టైటిల్‌ను తృటిలో చేజార్చుకున్న ఇంగ్లండ్.. ప్రతీకారం తీసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకున్న విండీస్‌.. ముచ్చటగా మూడో టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు రెండోసారి ఈ కప్పును సొంతం చేసుకోవాలనే పట్టుదలతో మోర్గాన్‌ సేన ఉంది.

ఇంగ్లండ్‌ను ఆపతరమా?

ఇంగ్లండ్‌ను ఆపతరమా?

ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్‌, స్టార్ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ లేకపోయినా ఇంగ్లండ్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ ఇయాన్ మోర్గాన్‌ సహా జోస్ బట్లర్‌, జాసన్ రాయ్‌, డేవిడ్ మలన్‌, జానీ బెయిర్‌ స్టో లాంటి విధ్వంసక బ్యాటర్లున్న జట్టుతో విండీస్‌ బౌలర్లకు ప్రమాదం తప్పకపోవచ్చు.వామప్‌ మ్యాచ్‌ల్లో భారత్ చేతిలో ఓడిన ఇంగ్లండ్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. జోస్ బట్లర్‌, బెయిర్‌ స్టోలు టచ్‌లోకి రావడం సానుకూలాంశం. అయితే కెప్టెన్ మోర్గాన్ ఫామ్ టీమ్‌ను కలవరపరుస్తోంది. అంతేకాకుండా మోర్గాన్ కోసం టీ20ల్లో వరల్డ్ నెంబర్ వన్ బ్యాట్స్‌మన్ అయిన డేవిడ్ మలాన్‌కు పక్కనపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీతో పాటు మరో స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ యూఏఈ పిచ్‌లపై కీలకం కానున్నారు. ఈ ఇద్దరు.. విండీస్‌ హిట్టర్లను ఎలా అడ్డుకుంటారో చూడాలి. మిల్స్‌, విల్లీ, మార్క్‌వుడ్‌, క్రిస్‌ వోక్స్‌, జోర్డాన్‌ లాంటి పేసర్లు జట్టులో ఉన్నారు. క్రిస్ వోక్స్‌కు బదులు డేవిడ్ విల్లే‌ను ఆడించవచ్చు.

విధ్వంసకర వీరులున్నా..?

విధ్వంసకర వీరులున్నా..?

వెస్టిండీస్‌ జట్టు నిండా హిట్లర్లే. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేసే ఆటగాళ్లే. కానీ సమష్టిగా ఆడలేకపోవడం.. నిలకడ లోపించడం ఆ జట్టును వేదిస్తున్నాయి. ప్రపంచకప్‌ వామప్‌ మ్యాచ్‌ల్లోనూ ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ తేలిపోయింది. లూయిస్‌, సిమన్స్‌, గేల్‌, నికోలస్ పూరన్‌, కీరన్ పొలార్డ్‌, హెట్‌మైర్‌, రస్సెల్‌, డ్వేన్ బ్రావో లాంటి హిట్టర్లు జట్టులో ఉన్నప్పటికీ.. అవసరమైన సమయంలో కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకోలేకపోతున్నారు. బ్రావో, రసెల్‌, పొలార్డ్‌.. బ్యాట్‌తో పాటు తమ తెలివైన బౌలింగ్‌తోనూ సత్తాచాటగలరు. స్పిన్నర్లు వాల్ష్‌, ఛేజ్‌, హొసేన్‌, పేసర్లు రవి రాంపాల్‌, థామస్‌, మెక్‌కాయ్‌తో కూడిన బౌలింగ్‌లో కీలకం.

పిచ్‌:

పిచ్‌:

దుబాయ్‌ గ్రౌండ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించవచ్చు. దీంతో భారీ స్కోరు ఖాయంగా కనిపిస్తోంది. ఛేజింగ్‌ జట్టుకు విజయావకాశం ఉండడంతో టాస్‌ గెలిచిన టీమ్‌ ఫీల్డింగ్‌ ఎంచుకునే అవకాశముంది. ఈ వికెట్‌పై స్పిన్నర్లకు అడ్వాంటేజ్ ఉండటం ఐపీఎల్‌లో చూశాం.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

ఇంగ్లండ్‌: జాసన్ రాయ్‌, జోస్ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్‌, ఇయాన్ మోర్గాన్‌(కెప్టెన్), క్రిస్ వోక్స్‌/డేవిడ్ విల్లే, క్రిస్ జోర్డాన్‌, ఆదిల్ రషీద్‌, మార్క్‌వుడ్‌, మిల్స్‌

వెస్టిండీస్‌: ఎవిన్ లూయిస్‌, సిమన్స్‌, క్రిస్ గేల్‌, నికోలస్ పూరన్‌, షిమ్రన్ హెట్‌మైర్‌, కీరన్ పొలార్డ్‌, ఆండ్రీ రస్సెల్‌, డ్వేన్ బ్రావో, వాల్ష్‌, మెక్‌కాయ్‌, థామస్‌/రవి

Story first published: Saturday, October 23, 2021, 10:48 [IST]
Other articles published on Oct 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X