న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కరోనా టెస్ట్‌ల్లో నెగటీవ్ రావడంతో జట్టుతో కలిసిన ఆర్చర్

England Pacer Jofra Archer Cleared To Rejoin England Squad After Negative Cornoavirus Test

మాంచెస్టర్‌: 'బయో సెక్యూర్‌' నిబంధనలను ఉల్లంఘించి వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు దూరమైన ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ మళ్లీ జట్టుతో కలిశాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌ ముగిసిన అనంతరం ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వ్యక్తిగత వాహనాల్లో రెండో టెస్ట్‌ వేదిక మాంచెస్టర్‌ వెళ్లారు. ఆర్చర్‌ కూడా కారులో వెళుతూ మార్గమధ్యలో బ్రైటన్‌లోని తన ఇంటిలో గంటపాటు గడిపాడు. ఆ తర్వాత మాంచెస్టర్‌ చేరుకున్నాడు. గర్ల్‌ఫ్రెండ్‌ను కలుసుకొనేందుకే ఆర్చర్‌ ఇంటికి వెళ్లినట్టు కూడా వార్తలొచ్చాయి. ఇలా రక్షణ వలయాన్ని దాటడంపై ఆగ్రహించిన ఈసీబీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ వెంటనే అతడిని రెండో టెస్టు నుంచి తప్పించింది.

అప్పటి నుంచి ఐదు రోజుల ఐసోలేషన్‌లో ఉన్న ఆర్చర్‌కు రెండు సార్లు కరోనా టెస్ట్‌లు చేయగా నెగెటివ్ వచ్చింది. దీంతో అతను తిరిగి జట్టుతో కలిశాడు. మూడో టెస్ట్ సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటాడు. ప్రొటో‌కాల్స్‌ను బ్రేక్ చేసిన ఆర్చర్‌ను రాత పూర్వకంగా హెచ్చరించిన క్రమశిక్షణ కమిటీ 15 వేల పౌండ్లు జరిమానా విధించింది. ఇంగ్లండ్ వెస్టిండీస్ మధ్య చివరి, ఫైనల్ టెస్ట్ శుక్రవారం ప్రారంభంకానుంది. ఇక తొలి టెస్ట్ విండీస్ గెలవగా.. రెండో టెస్ట్ ఇంగ్లండ్ గెలిచి సిరీస్ 1-1తో సమం చేసింది.

మహిళల వన్డే ప్రపంచకప్ జరిగేనా.. మిథాలీ కల నెరవేరెనా?మహిళల వన్డే ప్రపంచకప్ జరిగేనా.. మిథాలీ కల నెరవేరెనా?

Story first published: Wednesday, July 22, 2020, 10:04 [IST]
Other articles published on Jul 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X