న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENGvsPAK : వైట్ వాష్‌పై కన్నేసిన ఇంగ్లండ్.. పాక్‌తో మూడో టెస్టు ఆడే జట్టు ఇదే..!

England eyes clean sweap against Pakistan

పాకిస్తాన్‌ను ఆ దేశంలోనే ఓడించడం చాలా కష్టమంటారు. కానీ ఇంగ్లండ్ అదే చేసి చూపించింది. మూడు టెస్టుల సిరీస్ కోసం పాకిస్తాన్ వెళ్లిన ఇంగ్లిష్ జట్టు.. తొలి రెండు టెస్టుల్లో అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. బౌలర్లకు ఏమాత్రం సహకారం అందని రావల్పిండి పిచ్‌పై కూడా పాక్‌ను వాళ్లు నియంత్రించిన తీరు ఇంగ్లండ్ టెస్టు క్రికెట్‌లో కొత్త పద్ధతిని ప్రపంచానికి చాటిచెప్పింది.

ఆ తర్వాత ముల్తాన్‌ వేదికగా జరిగిన టెస్టులో కూడా ఇంగ్లండ్ సత్తా చాటింది. వరుసగా రెండు టెస్టులు గెలిచిన తర్వాత ఇంగ్లండ్ సారధి బెన్ స్టోక్స్ మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో గెలవడం అంటే వట్టి టెస్టు సిరీస్ మాత్రమే కాదని, చరిత్ర సృష్టించినట్లని చెప్పాడు. ఆ మాటలే ఈ విజయం వారికి ఎంత ప్రధానమో తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం జరిగే మూడో టెస్టులో కూడా పాకిస్తాన్‌ను చిత్తు చేయాలని స్టోక్స్ సేన ఉవ్విళ్లురుతోంది. అదే సమయంలో చివరి టెస్టులో అయినా నెగ్గి పరువు నిలుపుకోవాలని బాబర్ ఆజమ్ అండ్ టీం ప్రయత్నిస్తోంది.

కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ రెండు విభాగాలకు సహకరిస్తుందని తెలుస్తోంది. మ్యాచ్ ఆరంభంలో బ్యాటర్లు సులభంగా పరుగులు చేస్తారని, అదే సమయంలో పేసర్లు కూడా సత్తా చాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే రోజులు గడిచే కొద్దీ ఈ పిచ్ బౌలర్లకు సహకరిస్తుందట. దీంతో మంచి పోటీ ఉన్న మ్యాచ్ చూడొచ్చని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు ఎలాంటి మార్పులూ లేకుండా బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో ఇప్పటికే సిరీస్ నెగ్గిన ఇంగ్లండ్ మాత్రం వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్‌కు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.

పాకిస్తాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఆఘా సల్మాన్, సవూద్ షకీల్, మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రాఫ్, జాహిద్ మహమూద్, మహమ్మద్ అలీ, అబ్రార్ అహ్మద్

ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), విల్ జాక్స్, ఓలీ రాబిన్సన్, జాక్ లీచ్, మార్క్ వుడ్, జేమీ ఓవర్టన్

Story first published: Friday, December 16, 2022, 13:37 [IST]
Other articles published on Dec 16, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X