న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

న్యూజిలాండ్-ఇంగ్లండ్‌ మధ్య మరో సూపర్ ఓవర్.. మళ్లీ ఇంగ్లండే విజేత!!

England beat New Zealand in another super over to win T20 series

ఆక్లాండ్‌: లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది 'సూపర్‌ ఓవర్‌'. న్యూజిలాండ్-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత సూపర్ ఓవర్‌ నిర్వహిస్తే.. అదీ టై అయింది. దీంతో బౌండరీల లెక్క ప్రకారం టోర్నమెంట్ విజేతగా ఇంగ్లండ్‌ను ప్రకటించారు. అప్పుడు అంతా కివీస్‌ది దురదృష్టం అనుకున్నారంతా.

భారత్-బంగ్లాదేశ్‌ చివరి టీ20.. నాగ్‌పూర్‌లో గెలిచేదెవరు.. ఒక మార్పుతో భారత్?భారత్-బంగ్లాదేశ్‌ చివరి టీ20.. నాగ్‌పూర్‌లో గెలిచేదెవరు.. ఒక మార్పుతో భారత్?

మరో సూపర్ ఓవర్:

మరో సూపర్ ఓవర్:

ప్రపంచకప్‌ అనంతరం న్యూజిలాండ్-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరగిన తొలి ద్వైపాక్షిక సిరీస్‌లో నిర్ణయాత్మక మ్యాచ్‌ అయిన ఐదవ టీ20 మ్యాచ్‌కు కూడా సూపర్‌ ఓవర్‌ తప్పలేదు. ఈ సూపర్‌ ఓవర్‌లో కూడా ఇంగ్లండ్‌ విజేతగా నిలిచి సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది. అయితే ఈ సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లండ్‌ పరుగుల పరంగానే గెలిచింది.

వరుణుడు ఆటంకం.. మ్యాచ్‌ 11 ఓవర్లకు కుదింపు:

వరుణుడు ఆటంకం.. మ్యాచ్‌ 11 ఓవర్లకు కుదింపు:

ఐదవ టీ20కి వరుణుడు ఆటంకం కల్గించడంతో మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ ఐదు వికెట్ల నష్దానికి 146 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (50; 20 బంతుల్లో 3 పోర్లు, 5 సిక్సర్లు), మున్రో (46; 21 బంతుల్లో 2 పోర్లు, 4 సిక్సర్లు) చెలరేగారు. వీరికి తోడు సీఫెర్ట్‌ ( 39; 16 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్సర్లు) కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో న్యూజిలాండ్‌ భారీ స్కోర్ చేసింది.

 మ్యాచ్‌ టై:

మ్యాచ్‌ టై:

147 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌ సైతం 11 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులే చేసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును బెయిర్‌ స్టో (47; 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు), ఇయాన్ మోర్గాన్‌ (17; 7 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) ఆదుకున్నారు. సామ్‌ కరాన్‌ (24; 11 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. చివరలో టామ్‌ కరాన్‌ ( 12; 9 బంతుల్లో 1 సిక్స్‌), క్రిస్‌ జోర్డాన్‌ (12 నాటౌట్‌; 3 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌), శామ్‌ బిల్లింగ్స్‌ (11 నాటౌట్‌; 10 బంతుల్లో 1 ఫోర్‌)లు పోరాడడంతో మ్యాచ్‌ టై అయ్యింది.

 సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లండ్ విజయం:

సూపర్‌ ఓవర్‌లో ఇంగ్లండ్ విజయం:

మ్యాచ్‌ టై అవ్వడంతో అంపైర్లు సూపర్ ఓవర్ నిర్వహించారు. కివీస్‌ తరఫున సూపర్‌ ఓవర్‌ను సౌతీ వేయగా.. ఇంగ్లండ్‌ తరఫున జోర్డాన్‌ వేశాడు. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ వికెట్‌ నష్టపోకుండా17 పరుగులు చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్‌ వికెట్‌ నష్టానికి 8 పరుగులే చేసి ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లండ్ 7 పరుగుల తేడాతో విజయం సాధించి.. సిరీస్‌ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.

Story first published: Sunday, November 10, 2019, 12:47 [IST]
Other articles published on Nov 10, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X