న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ప్రపంచకప్‌ ఊపును యాషెస్‌లోనూ సాగిస్తాం.. ఆ సిరీస్ కోసం వేచిచూస్తున్నా

MS Dhoni Has No Immediate Plans To Retire, Says Longtime Friend || Oneindia Telugu
England Allrounder Sam Curran can’t wait to play in the Ashes Series


ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్‌ ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఇంగ్లాండ్‌ జట్టులో చోటు దక్కించుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. సామ్ కర్రన్‌ గత కొంత కాలంగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ముఖ్యంగా టెస్టు మ్యాచ్‌లో కీలక పాత్ర పోషించాడు. గతేడాది భారత్‌తో టెస్టు సిరీస్‌ విజయంలో కర్రన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. ఇక ఐపీఎల్-12లో పంజాబ్ జట్టు తరపున విశేషంగా రాణించాడు.

ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్ లోగో ఆవిష్కరణప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్ లోగో ఆవిష్కరణ

సామ్ కర్రన్‌ వరుసగా మూడు టెస్టుల్లో సిక్స్ బాది హాఫ్ సెంచరీలను అందుకున్న తొలి ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. లీడ్స్ వేదికగా 2018లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శామ్ కుర్రన్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. అనతి కాలంలోనే తనదైన ముద్ర వేసాడు. ఐపీఎల్-12లో విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్‌ గేల్‌తో ప్రశంసలు కూడా అందుకున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్‌ జట్టులో మాత్రం ఎంపిక కాలేదు. తాజాగా ఐర్లాండ్‌తో జరగనున్న ఏకైక టెస్టు మ్యాచ్‌కు ఎంపికయ్యాడు.

ఈ సందర్భంగా కర్రన్‌ మాట్లాడుతూ... 'పంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఆ రోజు ఆదివారం కావడం కూడా మా జట్టుకు మరింత మద్దతు లభించింది. ఇంగ్లాండ్ కప్ గెలిచినందుకు సంతోషంగా ఉంది. యాషెస్‌ సిరీస్‌లో ఆడటం గొప్ప విషయంగా భావిస్తున్నా. యాషెస్‌ కోసం వేచిచూస్తున్నా. ప్రపంచకప్‌ ఊపును యాషెస్‌లోనూ సాగిస్తాం. కచ్చితంగా సెప్టెంబర్‌లో ఓవల్‌లో యాషెస్‌ ట్రోఫీని అందుకోవాలని ఆశిస్తున్నా' అని కర్రన్‌ తెలిపాడు.

Story first published: Friday, July 19, 2019, 17:50 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X