న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెన్ స్టోక్స్‌కు కీలక అవార్డు ఇవ్వ‌నున్న న్యూజిలాండ్!!

England Allrounder Ben Stokes nominated for New Zealander of the Year award

ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత పోరాటం చేసిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ 'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నామినేట్ అయ్యాడు. బెన్‌స్టోక్స్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టులో ఆడుతున్నప్పటికీ అతను న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చ‌ర్చ‌లో జన్మించారు. బెన్‌స్టోక్స్ త‌ల్లితండ్రులు మ‌వోరి తెగ‌కు చెందిన‌వారు. అందుకే స్టోక్స్ ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.

ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్‌లో 84 పరుగులతో బెన్ స్టోక్స్‌ అద్భుతంగా పోరాడి న్యూజిలాండ్‌కు కప్ దక్కకుండా చేసాడు. ఫైన‌ల్ ఓవ‌ర్‌, సూప‌ర్ ఓవ‌ర్‌లోనూ కీల‌క పరుగులు చేసి కివీస్‌కు కప్ దూరం చేసిన స్టోక్స్‌.. ఆ దేశ‌ అవార్డుకు నామినేట్ అవ్వడం విశేషం. న్యూజిలాండ‌ర్ ఆఫ్ ఇయ‌ర్ అవార్డు కోసం మొత్తం ప‌ది మందిని నామినేట్ చేస్తారు. ఆ జాబితా నుంచి ఫైనల్ విన్న‌ర్‌ను ఎంపిక చేస్తారు. ఈ అవార్డును 2020 ఫిబ్ర‌వ‌రిలో అంద‌జేస్తారు. మరోవైపు న్యూజిలాండ్‌ కెప్ట‌న్ కేన్ విలియ‌మ్‌స‌న్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. బెన్‌ స్టోక్స్‌కు ఇంగ్లండ్ కూడా నైట్‌వుడ్ అవార్డుకు నామినేట్ చేసిన విషయం తెలిసిందే.

న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ చేయడంపై అవార్డ్స్ చీఫ్ జడ్జ్ స్పందిస్తూ... 'బెన్‌ స్టోక్స్ న్యూజిలాండ్ జట్టు తరపున ఆడకపోయినప్పటికీ.. అతను పుట్టింది న్యూజిలాండ్‌లోనే. ఇప్పటికీ స్టోక్స్ తల్లిదండ్రులు ఇక్కడే నివసిస్తున్నారు. చాలామంది కివీస్ అభిమానులు స్టోక్స్‌ను తమవాడిగా చెప్పుకుంటారు. ఈ కారణాల దృష్ట్యా బెన్ స్టోక్స్‌ను ఈ అవార్డుకు నామినేట్ చేసాం' అని తెలిపారు.

Story first published: Friday, July 19, 2019, 15:56 [IST]
Other articles published on Jul 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X