
ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థులకు దడ
ఇంగ్లాండ్ టెస్ట్‌ల్లోనూ ఎటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థులకు దడ పుట్టించాలనే కొత్త వ్యూహాన్ని అనుసరిస్తుంది. సిరీస్‌లోని రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ఎటాకింగ్ గేమ్ స్పష్టంగా కనిపించింది. కివీస్ బౌలర్లను జానీ బెయిర్‌స్టో పూర్తిగా దెబ్బతీశాడు. ఆ టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో కేవలం 50ఓవర్లలో 299పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని అందుకుంది.

వీలయినంత వినోదాన్ని అందిస్తాం
ఇక ఆఖరి టెస్టు మ్యాచ్‌లో వీలైనంత వినోదాన్ని అందించడానికి ప్రయత్నిస్తామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పాడు. గత వారం సెకండ్ ఇన్నింగ్స్ ఫైనల్ డే కోసం 20వేల మంది ప్రేక్షకులు వచ్చిన విషయాన్ని స్టోక్స్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. 'నేను మా ప్లేయర్లతో చెప్పాను. మనం టెస్ట్ క్రికెట్‌ను ఓ క్రీడా విషయంగా కాకుండా.. ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చే వ్యాపారంలో ఉన్నట్లుగా ఆలోచించి చూద్దాం అని సూచించాను.
గత వారం ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్‌లో మా ఆటను చూడటానికి 20,000మంది ప్రేక్షకులు రావడానికి ఓ కారణం ఉంది. అదేంటంటే మనం ఒక్క రోజులోనే మన ఎటాకింగ్ గేమ్‌తో ఏదైనా చేయగలమని వారి నమ్మకం. కాబట్టి గత వారం కంటే నిర్భయంగా, సానుకూలంగా, దూకుడుగా ఈ టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధంగా ఉండాలని నేను జట్టుకు తెలిపాను' అని స్టోక్స్ విలేకరుల సమావేశంలో తెలిపాడు.

వేరే కోణం నుంచి చూడడం ఆసక్తికరం
ఇదిలా ఉంటే.. రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. సిరీస్‌లోని మూడోది మరియు చివరిదైన మ్యాచ్‌లో తిరిగి ప్లేయింగ్ XIలోకి రాబోతున్నాడు. ఇక విలియమ్సన్ మాట్లాడుతూ.. 'నేను గ్రౌండ్లో కాకుండా గ్రౌండ్ బయట నుంచి ఐసోలేషన్లో ఉంటూ మ్యాచ్ చూడడం కాస్త ఢిపరెంట్‌గా ఉంది. ఐసోలేషన్లో ఉండడం నాకు ఇష్టం కాదు కానీ తప్పదు. ఈ రకంగా వేరే కోణం నుంచి చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది.
ఇంగ్లాండ్ బలమైన జట్టు కాబట్టి.. మా వరకు జట్టు పరంగా మేము మరింత మెరుగుపరచుకోవాల్సిన అవసరముందని అర్థమైంది.' అని కేన్ అన్నారు. ఇకపోతే కివీ బ్యాటర్లు డారిల్ మిచెల్, వికెట్ కీపర్-బ్యాటర్ టామ్ బ్లండెల్, విల్ యంగ్, డెవాన్ కాన్వే న్యూజిలాండ్ తరఫున మంచి నాక్స్ ఆడుతూ.. జట్టును బ్యాటింగ్ పరంగా దుర్భేద్యంగా చేస్తున్నారు. చివరి మ్యాచ్‌లోనూ వీరు రాణించాల్సిన అవసరం ఉంది.