న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆటలో ఏబీసీడీలు తెలియని వాళ్లు కూడా వాగుతున్నారు: అజహరుద్దీన్

'Embarrassed' Mohammad Azharuddin hits out at people who don't know 'A B C D of cricket'

హైదరాబాద్: భారత జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ తన సొంత పట్టణంలోనే ఘోర పరాభవానికి గురైయ్యాడు. ఈ మధ్యనే హెసీఏలో జరుగుతున్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. రెండ్రోజుల కిందట శేష్ నారాయణ సస్పెన్షన్ గురించి హెచ్‌సీఏ తరచూ సమావేశమవుతూనే ఉంది.

ఈ నేపథ్యంలో జస్టిస్ లోధా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హెచ్‌సీఏ సమావేశం ప్రకటించింది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు విచ్చేసిన అజహర్‌ను మెయిన్‌గేట్ వద్దనే ఆపేశారు. సుమారు గంటకుపైగా పట్టించుకోకుండా వదిలేశారు. ఆదివారం జనవరి 7వ తేదీ జరిగిన ఈ ఘటన గురించి అజహర్ ఇలా స్పందించాడు.

'మీకెలాంటి సమస్య ఉన్నా నేను సహాయం చేయగలను. అలా కాకుండా నన్ను మీలో కలవనివ్వకుండా చేస్తే ఎలా. అలాంటప్పుడు నన్ను పిలవకుండా ఉండాల్సింది' అని అజహర్ వ్యాఖ్యానించాడు.

'ఇది చాలా పరువుతక్కువ విషయం. నేనేమీ చెప్పలేకపోతున్నా. నేను దాదాపు గంటసేపు గేట్ బయటేఉన్నా. నేను భారత జాతీయ జట్టుకు కెప్టెన్‌గా పదేళ్ల పాటు పని చేశాను. ఇక్కడ ఉన్నవాళ్లకు క్రికెట్‌లో ఏబీసీడీలు కూడా తెలియవు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బ్యాట్ కానీ, బాల్ గాని జీవితంలో పట్టుకుని ఉండరు.' అని ఇప్పటి వరకు 99టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అజహర్ కడిగి పడేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 8, 2018, 15:40 [IST]
Other articles published on Jan 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X