న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నా: బ్రావో

Dwayne Bravo Says Current West Indies T20 team is better than 2016 World Cup-winning side

ఆంటిగ్వా: 2016 టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమ్ కన్నా ప్రస్తుత జట్టే ఎంతో పటిష్టంగా ఉందని వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ డ్వేన్‌ బ్రావో తెలిపాడు. ప్రస్తుత జట్టులో బ్యాటింగ్‌ డెప్త్ అద్బుతంగా ఉందన్నాడు. కొన్ని పొరపాట్ల కారణంగా తమ బ్యాటింగ్‌ లైనప్ సామర్థ్యం పూర్తి స్థాయిలో బయటకు రావడం లేదన్నాడు.తమ బ్యాటింగ్‌ లైనప్‌ను చూస్తే కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుందని, ఆఖరి వికెట్ వరకూ బ్యాటింగ్‌ చేసే ఆటగాళ్లు తమ జట్టులో ఉన్నారని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫో‌తో మాట్లాడుతూ బ్రావో తెలిపాడు.

గత శ్రీలంక సిరీస్‌లో తమ బ్యాటింగ్‌ లైనప్‌ సామర్థ్యాన్ని కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ మరింత వెలికి తీశాడని, తనను 9వ స్థానంలో ఆడించడమే ఇందుకు ఉదాహరణ అని ఈ విండీస్ వీరుడు పేర్కొన్నాడు. టీ20 క్రికెట్‌లో తానేప్పుడు 9వ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తానని ఊహించలేదని, బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా ఉండటంతో ఆ స్థానంలో రావాల్సి వస్తుందన్నాడు.

'వెస్టిండీస్ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. 2016 ప్రపంచకప్ గెలిచిన జట్టు కంటే ప్రస్తుత జట్టు చాలా బలమైనది. నేనేం జోక్ చేయడం లేదు. పదో స్థానం వరకు బ్యాటింగ్ చేసే సత్తా మా జట్టు సొంతం. ప్రత్యర్థులపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించే జట్టు మాది. ముఖ్యంగా టీ20ల్లో మాకు తిరుగులేదు. ఇక నుంచి నేను జట్టు బౌలింగ్‌ విభాగంలో కీలక పాత్ర పోషించాలనుకుంటున్నా. ప్రధానంగా డెత్‌ ఓవర్ల స్పెషలిస్టుగా ఆకట్టుకోవాలనుకుంటున్నా. గతంలో తాను ఏ రకంగా అయితే బౌలింగ్‌ చేసేవాడినో దాన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నా'అని బ్రావో తెలిపాడు.

పరమిత ఓవర్ల కెప్టెన్ పొలార్డ్‌లో నిజాయితీని చూశానని బ్రావో తెలిపాడు. 'పొలార్డ్‌ ఎప్పుడూ గెలవడాన్ని ఆస్వాదిస్తాడు. కెప్టెన్‌గా అది చాలా ముఖ్యం. ఓటమిని ఏమాత్రం సహించడు. గెలుపు కోసం ఉన్న అన్ని మార్గాలను ఎంటుకుంటాడు. పొలార్డ్‌ చాలా నిజాయితీ పరుడు. సెలక్షన్‌ విషయంలో అతని మార్కు కచ్చితంగా ఉంటుంది. ' అని బ్రావో కొనియాడాడు.

Story first published: Thursday, May 7, 2020, 16:52 [IST]
Other articles published on May 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X