సక్సెస్ రావాలంటే ఆ మూడూ చేయాలంటోన్న బ్రావో

Posted By:
Dwayne Bravo’s 3S mantra to be a champion: Shopping, sports, sleeping

హైదరాబాద్: క్రికెట్ ఒక్కటే కాదు. సక్సెస్ అనేది ప్రతి విషయంలో ఉంటుంది అంటున్నాడు బ్రావో. తన వ్యక్తిగత జీవితం గురించి ఉదహరిస్తూ.. సక్సెస్ మంత్ర చెప్పుకొచ్చాడు.అటు బంతితో ఇటు బ్యాటుతో మ్యాచ్‌లను మలుపుతిప్ప గల సమర్థుడతను. ఐపీఎల్‌ 11లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబైతో ప్రారంభ మ్యాచ్‌లో కష్టకాలంలో క్రీజులో అడుగుపెట్టిన బ్రావో 30 బంతుల్లో 68 పరుగులు చేసి చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అద్భుతమైన విజయం అందించాడు. అతని విజయ రహస్యాలు ఇవే

ఇన్నాళ్ల తర్వాత కలిసి ఆడుతున్నాం

ఇన్నాళ్ల తర్వాత కలిసి ఆడుతున్నాం

ఇతర దేశాల ఆటగాళ్లతో కలిసి గడపడమంటే తనకెంతో ఇష్టమంటున్నాడు బ్రావో. చాలా జట్ల తరఫున ఆడిన బ్రావో చెన్నై సూపర్‌ కింగ్స్‌లో ఆసీస్‌ ఆటగాడు షేన్‌వాట్సన్‌ను చూసి ఇలా స్పందించాడట. ‘ఇంత కాలానికి మనిద్దరం ఒకే జట్టు తరఫున ఆడుతున్నాం. మనం ప్రత్యర్థులుగా చాలా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాం' అని వాట్సన్‌తో అన్నాడట. అనుభజ్ఞులైన ఆటగాళ్లు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉంటే యువకులకు చాలా ఉపయోగం అంటున్నాడు.

అంతర్జాతీయ క్రికెటర్‌గా ప్రత్యర్థికి గౌరవం

అంతర్జాతీయ క్రికెటర్‌గా ప్రత్యర్థికి గౌరవం

ఈ మధ్యే చోటుచేసుకున్న డేవిడ్‌ వార్నర్‌, క్వింటన్‌ డికాక్‌ వివాదం గురించీ బ్రావో స్పందించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు బాగా ఆడుతున్నప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ ఒక అంతర్జాతీయ క్రికెటర్‌గా అవతలి వారికి గౌరవం ఇవ్వాలని సూచించాడు. విదేశాల్లో జరిగేవన్నీ వ్యక్తిగతంగా తీసుకోవద్దని సూచించాడు. తన ఆల్‌రౌండ్‌ ప్రతిభ గురించి మాట్లాడుతూ తనకు బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండూ ఇష్టమేనన్నాడు.

ఆట పాటలతో పాటు షాపింగ్‌, స్పోర్ట్స్‌, స్లీపింగ్‌

ఆట పాటలతో పాటు షాపింగ్‌, స్పోర్ట్స్‌, స్లీపింగ్‌

ఆట పాటల్లో ముందుండే బ్రావో ఖాళీ సమయంలో షాపింగ్‌, స్పోర్ట్స్‌, స్లీపింగ్‌ ఇష్టమట. ఒక్కసారి తను షాపింగ్‌ మాల్‌లో అడుగుపెడితే ఎప్పుడు ఇంటికి చేరుకుంటానో తెలియదంటున్నాడు. షూ, గడియారాలు, దుస్తులంటే తనకు వ్యామోహం అని చెప్తున్నాడు. బాస్కెట్‌ బాల్‌, సాకర్‌, కాస్త టెన్నిస్‌ ఆడుతుంటాడట. ఇక శిక్షణ లేకపోతే ఇంట్లో హాయిగా గడపడం, నిద్రపోవడం ఇష్టమట.

కరీబియన్‌ సంస్కృతిలో భాగమని:

కరీబియన్‌ సంస్కృతిలో భాగమని:

మెడలో బంగారు గొలుసులు ధరించడం కరీబియన్‌ సంస్కృతిలో భాగమని అందుకే కోట్నీ వాల్ష్‌ నుంచి క్రిస్‌గేల్‌, తనతో సహా అందరూ రెండు మూడు గొలుసులు వేసుకుంటామని పేర్కొన్నాడు. డబ్బులుంటే ఒక విమానం కొని, పైలట్‌ను నియమించి కుటుంబంతో ప్రపంచమంతా చుట్టిరావడం చాలా చాలా ఇష్టమని బ్రావో పేర్కొన్నాడు.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Tuesday, April 17, 2018, 20:52 [IST]
Other articles published on Apr 17, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి