న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ కప్: రిజర్వ్ ఆటగాళ్లుగా డ్వేన్ బ్రేవో, కీరన్ పొలార్డ్

ICC Cricket World Cup 2019 : Bravo and Pollard Included In WI Reserve Players List For World Cup
 Dwayne Bravo and Kieron Pollard included in West Indies reserve players list for 2019 World Cup

హైదరాబాద్: స్టార్ ఆల్ రౌండర్లు కీరోన్‌ పొలార్డ్‌, డ్వేన్‌ బ్రేవోలు వరల్డ్‌కప్‌లో వెస్టిండిస్ జట్టుకు స్టాండ్‌ బైగా ఎంపికయ్యారు. తాజాగా వెస్టిండిస్ క్రికెట్ బోర్డు మొత్తం 10 మందితో కూడిన రిజర్వ్‌ బెంచ్‌ని ప్రకటించగా అందులో ఆల్‌ రౌండర్లు బ్రేవో, పొలార్డ్‌లు చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

వరల్డ్‌కప్‌ కోసం వెస్టిండిస్ బోర్డు తొలుత ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల్లో ఎవరైనా గాయపడితే వారి స్థానంలో పొలార్డ్‌, బ్రేవోలకు అవకాశం దక్కుతుంది. వరల్డ్‌కప్‌కు ముందు ఐసీసీ నిర్వహించే రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లో వెస్టిండిస్ క్రికెట్ జట్టు మే 26వ తేదీన దక్షిణాఫ్రికాతో, మే 28వ తేదీన న్యూజిలాండ్‌తో తలపడనుంది.

ఆ తర్వాత టోర్నీలో భాగంగా వెస్టిండీస్‌ తన తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో తలపడనుంది. మే 31న జరిగే ఈ మ్యాచ్‌కి ట్రెంట్‌బ్రిడ్జ్‌ వేదిక కానుంది. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ఆల్ రౌండర్లు కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రేవోలు అద్భుత ప్రదర్శన చేశారు. పొలార్డ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించగా, బ్రేవో చెన్నై తరుపున ఆడాడు.

ఈ రెండు జట్లు హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్లో తలపడగా... ముంబై ఇండియన్స్ జట్టు ఒక పరుగు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించి నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

వరల్డ్‌కప్‌‌లో విండిస్ రిజర్వ్ ఆటగాళ్లు వీరే:
సునీల్‌ ఆంబ్రిస్‌, డ్వేన్‌ బ్రేవో, జాన్‌ క్యాంప్‌బెల్‌, జోనాథన్‌ కార్టర్‌, రోస్టన్‌ ఛేజ్‌, షేన్‌ డొవ్రిచ్‌, కీమో పాల్‌, ఖారీ పీరే, రేమాన్‌ రీఫర్‌, కీరోన్‌ పొలార్డ్‌

Story first published: Sunday, May 19, 2019, 13:21 [IST]
Other articles published on May 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X