న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తలొగ్గిన బీసీసీఐ: డోపీ అభిషేక్‌ స్థానంలో అక్షయ్

Three Teams Picked For Duleep Trophy After BCCI Had Decided
Duleep Trophy: BCCI replaces banned Punjab keeper Abhishek Gupta with Akshay Wadkar

హైదరాబాద్: బీసీసీఐ దులీప్ ట్రోఫీ నేపథ్యంలో పొరబాటు చేసింది. దానిని వెనక్కి తీసుకునే క్రమంలో పంజాబ్ వికెట్ కీపర్ అభిషేక్ గుప్తా‌ను ఇండియన్ రెడ్ స్క్వాడ్ నుంచి తప్పించాలని యోచిస్తోంది. విజయవాడ వేదికగా జరగనున్న దులీప్ ట్రోఫీ.. ఆగష్టు 17 నుంచి సెప్టెంబరు 8వరకూ జరగనుంది. అయితే నిషేదిత ఉత్ప్రేరకాలు వాడినందుకు గానూ అభిషేక్ గుప్తా జనవరి 15నుంచి సెప్టెంబరు 14వరకూ ఎనిమిది నెలల నిషేదాన్ని భరించాల్సి ఉంది.

ఈ క్రమంలో దులీప్ ట్రోఫీ జరుగుతున్న సమయంలో అతని నిషేదం గడువు పూర్తవదు. కానీ, అతణ్ని జట్టులోకి తీసుకుంటూ బీసీసీఐ అధికారిక జట్టును సోమవారం ప్రకటించింది. ఆ తర్వాత తాను డోపింగ్‌కు పాల్పడినట్లు పరిశీలించలేదని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీంతో పంజాబ్ వికెట్ కీపర్ అభిషేక్ గుప్తాకు బదులుగా అక్షయ్ వాడ్కర్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది.

ఈ విషయంపై బీసీసీఐ తాత్కాలిక గౌరవ అధ్యక్షులు అమితాబ్ చౌదరి మాట్లాడారు. 'అతను డోపింగ్‌కు పాల్పడినట్లు మేము పరిశీలించలేదు. జట్టును ప్రకటించిన తర్వాత పలు విమర్శలు వస్తుండటంతో బీసీసీఐ యాంటీ డోపింగ్ టీంను సంప్రదించి వివరాలు తెలుసుకున్నాం. అతని ఎనిమిది నెలల డోపింగ్ గడువు ఇంకా పూర్తికాకపోవడంతో.. అతణ్ని జట్టు నుంచి తప్పించాం. ఆ స్థానంలో.. అక్షయ్ వాడ్కర్‌ను తీసుకుంటున్నాం' అని పేర్కొన్నారు.

రివైజ్ చేసిన తర్వాత బీసీసీఐ ప్రకటించిన ఇండియా బ్లూ, ఇండియా రెడ్; ఇండియా గ్రీన్ జట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇండియా బ్లూ:
Faiz Fazal (Captain), Abhishek Raman, Anmolpreet Singh, Ganesh Satish, N. Gangta, Dhruv Shorey, K.S. Bharat (WK), Akshay Wakhare, Saurav Kumar, Swapnil Singh, Basil Thampi, B Ayappa, Jaydev Unadkat, Dhawal Kulkarni.

ఇండియా రెడ్:
Abhinav Mukund (Captain), R.R. Sanjay, Ashutosh Singh, Baba Aparajith, Writtick Chatterjee, B. Sandeep, Akshay Wadkar (WK), S Nadeem, Mihir Hirwani, Parvez Rasool, R Gurbani, A Mithun, Ishan Porel, Y. Prithvi Raj.

ఇండియా గ్రీన్:
Parthiv Patel (Captain & WK), Prashant Chopra, Priyank Panchal, Sudeep Chatterjee, Gurkeerat Mann, Baba Indrajit, V.P. Solanki, Jajal Saxena, Karn Sharma, Vikas Mishra, K. Vignesh, Ankit Rajpoot, Ashok Dinda, Atith Sheth.

Story first published: Tuesday, July 24, 2018, 12:45 [IST]
Other articles published on Jul 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X