న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్‌ మ్యాచ్‌లో అరుదైన ఘటన.. అందరూ డకౌట్‌

Ten Ducks In An Innings,Team All Out For Four Extras ! || Oneindia Telugu
Duck tales: Kasargod U-19 girls all bowled out without scoring

క్రికెట్‌ మ్యాచ్‌లలో అరుదైన ఘటనలు చోటుచేసుకోవడం సహజమే. ఫీల్డర్, కీపర్, బౌలర్, బ్యాట్స్‌మన్‌ ఎవరో ఒకరు తమ మేటి ప్రదర్శనతో అరుదైన ఘటనలు సృష్టిస్తారు. అయితే జట్టు మొత్తం అరుదైన ఘటన సృష్టించడం చాలా అరుదు. అలాంటి అరుదైన ఘటనే తాజాగా చోటుచేసుకుంది. జట్టులోని మొత్తం 10 మంది బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

నార్త్‌జోన్‌ అండర్‌-19లో భాగంగా బుధవారం కేరళలోని మలప్పురం జిల్లా పెరింథల్‌మన్న స్టేడియంలో వాయనాడ్‌, కాసరగోడ్‌ మహిళల జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. 30 ఓవర్ల ఈ మ్యాచ్‌లో కాసరగాడ్‌ జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు వీక్షిత, చైత్ర రెండు ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా.. ఒక్క పరుగు కూడా చేయలేదు. ఇక మూడో ఓవర్‌ నుంచి కాసరగాడ్‌ పతనం మొదలైంది.

వాయనాడ్‌ కెప్టెన్‌ నిత్య లూర్ధ్‌ మూడో ఓవర్లో 3 వికెట్లు తీసింది. తర్వాతి ఓవర్లలో మరో 3 వికెట్లను కాసరగోడ్‌ చేజార్చుకుంది. మరో బౌలర్‌ జోషిత ఐదు బంతుల్లో హ్యాట్రిక్‌ తీసి మొత్తం 4 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. దీంతో 10 మంది బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. అందరూ బౌల్డ్ అవ్వడం మరో విశేషం. ఇక నాటౌట్‌గా నిలిచిన 11వ బ్యాటర్‌ ఖాతా తెరవలేదు. వయనాడ్‌ బౌలర్లు నాలుగు రన్స్‌ ఎక్స్‌ట్రాల రూపంలో ఇవ్వడంతో కాసరగోడ్‌ 4 పరుగులు చేసింది. విజయానికి కావాల్సిన ఐదు పరుగులను మొదటి ఓవర్లోనే సాధించిన వయనాడ్‌.. పది వికెట్లతో ఘన విజయం సాధించింది.

Story first published: Friday, May 17, 2019, 10:10 [IST]
Other articles published on May 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X