న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4 వద్ద లైఫ్ 264 వరకు తీసుకెళ్లింది: వన్డేల్లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు కొట్టింది ఈరోజే!

#OnThisDay: Rohit Sharma Scored Highest Individual Score In ODIs || Oneindia Telugu
Dropped on 4, makes 264: Remembering Rohit Sharmas record-breaking ODI knock

హైదరాబాద్: రోహిత్ శర్మ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డు ఒక్క రోహిత్ శర్మకే సొంతమైంది. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌ల తర్వాత వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్.

పరిమిత ఓవర్ల ఫార్మాట్ అంటేనే చాలు రోహిత్ శర్మ జూలు విదుల్చుతాడు. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడతాడు. అలాంటి రోహిత్ శర్మ తన తొలి డబుల్ సెంచరీని ఆస్ట్రేలియాపై నవంబర్ 2, 2013న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సాధించాడు. ఆ తర్వాత శ్రీలంకపై రెండు సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు.

<strong>India vs Bangladesh: ధోని రికార్డుపై కన్నేసిన వృద్ధిమాన్ సాహా</strong>India vs Bangladesh: ధోని రికార్డుపై కన్నేసిన వృద్ధిమాన్ సాహా

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా

వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా

2014, నవంబర్ 13న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్న రోహిత్ శర్మ(264) ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

33 ఫోర్లు, 9 సిక్సులు సాయంతో 264

33 ఫోర్లు, 9 సిక్సులు సాయంతో 264

రోహిత్ శర్న ఇన్నింగ్స్‌లో మొత్తం మొత్తం 33 ఫోర్లు, 9 సిక్సులు ఉన్నాయి. మ్యాచ్ మొదట్లో నిలకడగా ఆడిన రోహిత్ శర్మ సెంచరీ అనంతరం మరింత దూకుడుగా ఆడాడు. 100 బంతుల్లో సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఆ తర్వాత 173 బంతుల్లో 264 పరుగుల మైలురాయిని అందుకోవడం విశేషం.

చివరి 73 బంతుల్లో రోహిత్ శర్మ 164 పరుగులు

చివరి 73 బంతుల్లో రోహిత్ శర్మ 164 పరుగులు చేయడం విశేషం. ఈ క్రమంలో అంతకముందు వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వీరేంద్ర సెహ్వాగ్(219) రికార్డుని రోహిత్ శర్మ బద్దలు కొట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్ ఈ రికార్డుని 2011లో ఇండోర్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.

ఐదు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసిన భారత్

ఐదు వికెట్ల నష్టానికి 404 పరుగులు చేసిన భారత్

రోహిత్ బాదుడుకి భారత్ ఐదు వికెట్ల నష్టానికి 404పరుగులు చేసింది. ఆ తర్వాత చేధనకు దిగిన శ్రీలంక 153 పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది. 2014లో ఇదే రోజున రోహిత్ శర్మ వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన సందర్భంగా ఐసీసీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా క్రికెట్ అభిమానులతో పంచుకుంది.

మొహాలీ వేదికగా మరోసారి డబుల్

మొహాలీ వేదికగా మరోసారి డబుల్

ఆ తర్వాత డిసెంబర్‌ 13, 2017న శ్రీలంకపై మళ్లీ మోహాలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో మరోసారి డబుల్‌ సెంచరీ (208) చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి నాలుగు డబుల్ సెంచరీలు చేసింది భారత క్రికెటర్లే కావడం విశేషం. తొలుత సచిన్ టెండూల్కర్ (200 నాటౌట్) దక్షిణాఫ్రికా జట్టుపై తొలి డబుల్ సెంచరీ చేయగా, ఆ తర్వాత 2011లో వెస్టిండిస్‌పై సెహ్వాగ్(218) డబుల్ సెంచరీ సాధించాడు.

Story first published: Wednesday, November 13, 2019, 13:26 [IST]
Other articles published on Nov 13, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X