న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నన్నెందుకు ఎంపిక చేయలేదో అర్థం కావడం లేదు'

India Vs West Indies 2018,3rd ODI:Don’t know why I was not picked for remaining Windies ODIs: Jadhav
Don’t know why I was not picked for remaining Windies ODIs, says Jadhav

హైదరాబాద్: సెలక్టర్ల ఎంపికపై మరో టీమిండియా క్రికెటర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. వెస్టిండీస్‌తో జరగనున్న చివరి మూడు వన్డేల కోసం తనను ఎంపిక చేయకపోవడంపై కేదార్ జాదవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. విండీస్‌తో మూడు వన్డేల కోసం 15 మందితో కూడిన భారత జట్టుని గురువారం సెలక్టర్లు ప్రకటించగా.. కేదార్‌‌కు అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ విషయంపై సెలక్టర్లు కనీసం తనతో మాట్లాడలేదని ఆవేదన వెల్లగక్కాడు. ఆసియా కప్ ఫైనల్లో తొడ కండరాలు పట్టేయడంతో జాదవ్ చికిత్స తీసుకున్నాడు.

మూడు వన్డేల జట్టులో ఎందుకు చేర్చలేదో

మూడు వన్డేల జట్టులో ఎందుకు చేర్చలేదో

ప్రస్తుతం ఫిట్‌నెస్ నిరూపించుకుని దేశవాలీలో ఆడుతున్నాడు. కేదార్ జాదవ్ గురువారం మీడియాతో మాట్లాడాడు. ‘మూడు వన్డేలకు ఎంపిక చేసిన జట్టులో నా పేరు ఎందుకు చేర్చలేదో తెలియదు. జట్టులో లేకపోతే వచ్చే బాధ నాకు తెలుసు. జట్టును ఎంపిక చేసే సమయంలో సెలక్టర్లు కనీసం నన్ను సంప్రదించలేదు. ఫామ్‌లో ఉన్న ఆటగాడిని పక్కన పెట్టడం బాధాకరం.'

'వాట్ ఎ మ్యాన్': రన్ మెషిన్ కోహ్లీ రికార్డుపై అనుష్క కామెంట్

పూర్తి ఫిట్‌నెస్ సాధించి మ్యాచ్‌లాడుతున్నా.

పూర్తి ఫిట్‌నెస్ సాధించి మ్యాచ్‌లాడుతున్నా.

'గాయంతో వైదొలిగిన నేను పూర్తి ఫిట్‌నెస్ సాధించి మ్యాచ్‌లాడుతున్నా. నేషనల్ క్రికెట్ అకాడమీ ఫిట్ అని సర్టిఫై చేశాక.. ఆటగాళ్లపై నమ్మకం ఉంచాలి. గాయాలెప్పుడు అవుతాయో ఎవరికీ తెలియదు. ఫిజియో, ట్రైనర్లకు నేను నిజాలు మాత్రమే చెబుతాను. వారి నుంచి ఫిట్‌నెస్ విషయాలు దాచాలని భావించనని' చెప్పుకొచ్చాడు.

సెలక్టర్లు తమను సంప్రదించలేదని

సెలక్టర్లు తమను సంప్రదించలేదని

ఇటీవల వెస్టిండీస్‌లో టెస్ట్ సిరీస్‌కు జట్టు ఎంపిక సమయంలో సెలక్టర్లు తమను సంప్రదించలేదని కరుణ్ నాయర్, మురళీ విజయ్ ఆరోపించారు. వారితో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామంటూ ఈ ఇద్దరు ఆటగాళ్ల ఆరోపణల్ని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కొట్టిపారేసిన విషయం తెలిసిందే. పుణె వేదికగా శనివారం వెస్టిండీస్‌తో మూడో వన్డే ఆడనున్న టీమిండియా, 29న ముంబయి వేదికగా నాలుగో వన్డే, నవంబరు 1న తిరువనంతపురం వేదికగా చివరి వన్డే ఆడనుంది.

ఎంపిక చేసిన ఆటగాళ్లు వీరే:

ఎంపిక చేసిన ఆటగాళ్లు వీరే:

విరాట్ కోహ్లి (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, రిషబ్ పంత్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, ఖలీల్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే.

Story first published: Friday, October 26, 2018, 10:10 [IST]
Other articles published on Oct 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X