Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'వాట్ ఎ మ్యాన్': రన్ మెషిన్ కోహ్లీ రికార్డుపై అనుష్క కామెంట్‌

India vs Windies 2018, 2nd ODI : Anushka Sharma Celebrates Kohli’s Record-Breaking performance
 Anushka Sharma celebrates Virat Kohli’s record-breaking performance, says ‘what a man’

హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా విశాఖపట్నం వేదికగా బుధవారం వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించిన సంగ‌తి తెలిసిందే. వన్డేల్లో అత్యంత వేగంగా పది వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.

అంతేకాదు వన్డేల్లో పది వేల పరుగులు చేసిన ఐదో భారత బ్యాట్స్‌మన్‌గా మొత్తంగా 13వ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో (205) పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు సచిన్‌(259 ఇన్నింగ్స్‌) పేరిట ఈ రికార్డు ఉంది.

1
44267
 సచిన్‌తో పోలిస్తే 54 ఇన్నింగ్స్‌లు తక్కువ

సచిన్‌తో పోలిస్తే 54 ఇన్నింగ్స్‌లు తక్కువ

క్రికెట్ లెజెండ్ సచిన్‌తో పోలిస్తే 54 ఇన్నింగ్స్‌లు తక్కువగా ఉండటం విశేషం. భారత్ తరఫున సచిన్ టెండూల్కర్ (18,426), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రవిడ్ (10,889), మహేంద్రసింగ్ ధోనీ (10,126) మాత్రమే ఈ రికార్డుని అందుకున్నారు. తాజాగా విశాఖ వన్డేలో సెంచరీతో కెప్టెన్ కోహ్లీ కూడా ఈ జాబితాలో చేరాడు.

మొత్తం 5 వన్డేలాడిన కోహ్లీ 139 సగటుతో 556 పరుగులు

మొత్తం 5 వన్డేలాడిన కోహ్లీ 139 సగటుతో 556 పరుగులు

గతంలో ఈ స్టేడియంలో 118, 117, 99, 65 పరుగుల ఇన్నింగ్స్‌లతో మెరిసిన కోహ్లీ.. బుధవారం 157 నాటౌట్‌ పరుగులతో సత్తాచాటాడు. తాజా సెంచరీ కోహ్లీకి ఇది 37వ సెంచరీ కావడం విశేషం. ఈ సిరిస్‌లో ఇది రెండోది కావడం గమనార్హం. విశాఖ స్టేడియంలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో మూడో సెంచరీలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్‌లోని మిర్‌పూర్‌లో కోహ్లీ 13 ఇన్నింగ్స్‌లో నాలుగు సెంచరీలు బాదిన కోహ్లీ ఆ తర్వాత విశాఖలోనే ఎక్కువ సెంచరీలు సాధించాడు. అంతేకాదు ఈ స్టేడియంలో మొత్తం 5 వన్డేలాడిన కోహ్లీ 139 సగటుతో 556 పరుగులు రాబట్టాడు.

కోహ్లీ రికార్డుకు అనుష్క సైతం ఫిదా

కోహ్లీ రికార్డుకు అనుష్క సైతం ఫిదా

విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. కోహ్లీ రికార్డులకు అటు అభిమానులతో పాటు అతని భార్య అనుష్క శర్మ సైతం ఫిదా అయింది. అనుష్క త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీ 10వేల ప‌రుగులు పూర్తి చేసిన స‌మ‌యంలో వ‌చ్చిన విజువ‌ల్స్‌ని స్క్రీన్ షాట్స్ తీసి అభిమానులతో పంచుకుంది.

'వాట్ ఏ మాన్' అంటూ ఓ ఫోటోపై క్యాప్ష‌న్

'వాట్ ఏ మాన్' అంటూ ఓ ఫోటోపై క్యాప్ష‌న్

దీనికి 'వాట్ ఏ మాన్' అంటూ ఓ ఫోటోపై క్యాప్ష‌న్ కూడా పెట్టింది. అనుష్క అభిమానులతో పంచుకున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2017 డిసెంబ‌ర్‌లో వివాహం చేసుకున్న వీరిద్ద‌రూ వ్యక్తిగత విషయాలను సోష‌ల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంటారు.

గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో కోహ్లీ గురించి అనుష్క ఇలా

గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో కోహ్లీ గురించి అనుష్క ఇలా

గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో కోహ్లీ గురించి అనుష్క శర్మ మాట్లాడుతూ తాను గ్రేటెస్ట్ మేన్‌ని వివాహం చేసుకున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. అనుష్క ప్ర‌స్తుతం జీరో సినిమాతో బిజీగా ఉండ‌గా ఇందులో షారూక్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. డిసెంబ‌ర్ 21న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Story first published: Thursday, October 25, 2018, 13:27 [IST]
Other articles published on Oct 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+