న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షెఫాలీని తిట్టిన బిషన్ బేడీ.. మండిపడుతున్న ఫాన్స్!!

Dont Cry in Public: Cricket Fans Slam Bishan Singh Bedi for Criticizing Shafali Verma
Cricket Fans Slam Bishan Singh Bedi For Criticizing Shafali Verma | Oneindia Telugu

ముంబై: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో భారత మహిళలు 85 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలై రన్నరప్‌గా నిలిచారు. దీంతో తొలిసారి మెగా టోర్నీ ముద్దాడాలన్న కల అందని ద్రాక్షే అయింది. మహిళలు ఓటమి పాలవ్వడంతో జట్టుతో పాటు భారత అభిమానులంతా బాధపడ్డారు. కొందరైతే కన్నీరు కార్చారు.

<strong>'సచిన్‌'ను ప్రభావితం చేసిన మహిళలు ఎవరో తెలుసా?!!</strong>'సచిన్‌'ను ప్రభావితం చేసిన మహిళలు ఎవరో తెలుసా?!!

వెక్కివెక్కి ఏడ్చిన షెఫాలీ:

16 ఏళ్ల యువ సంచలనం షెఫాలీ వర్మ ఫైనల్ పోరులో నిరాశపరిచింది. సాధారణంగానే ఆమె భావోద్వేగానికి గురవుతుంది. కీలక మ్యాచ్‌లో త్వరగా ఔట్ అవ్వడం, జట్టు ఓటమి పాలవ్వడంతో.. కన్నీరు పెట్టుకుంది. సారథి హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, సహచర క్రికెటర్లు ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసినప్పటికీ వెక్కివెక్కి ఏడ్వసాగింది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్‌ బిషన్‌ సింగ్‌ బేడీ వారిని అభినందిస్తూ బహిరంగంగా కన్నీరు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేశారు.

 కన్నీళ్లెప్పుడూ వ్యక్తిగతమే:

కన్నీళ్లెప్పుడూ వ్యక్తిగతమే:

'భారత జట్టు అమ్మాయిలూ మీరు బాధపడొద్దు. ఫైనల్‌ చేరేందుకు మీరెంతో బాగా ఆడారు. ఆస్ట్రేలియాలో మీ ప్రతిభతో ఎంతగానో ఆకట్టుకున్నారు. మరో టోర్నీలో ఇంతకన్నా గట్టి పట్టుదలతో ఆడండి. అయితే వ్యక్తిగతంగా మీకు ఒక విన్నపం చేస్తున్నా. అమ్మాయిలూ దయచేసి బహిరంగంగా కన్నీరుపెట్టుకోవద్దు. ఓడిపోయాక అస్సలు ఏడవొద్దు. కన్నీళ్లెప్పుడూ వ్యక్తిగతమే' అని బేడీ ట్వీట్‌ చేశారు.

ఏడిస్తే తప్పేముంది?:

ఏడిస్తే తప్పేముంది?:

బిషన్ బేడీ అభిప్రాయంతో కొందరు ఫాన్స్ విభేదించారు. 'ప్రపంచకప్‌ ఎంతో విలువైంది. బహిరంగంగా ఏడిస్తే తప్పేముంది? అని ఎదురు ప్రశ్నించారు. 'అమ్మాయిలే కాదు అబ్బాయిలూ కన్నీరు కారుస్తారు. మనుషులకు భావోద్వేగాలు ఉంటాయి. వాళ్లేమీ మరమనుషులు కారు' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'మహిళలు కన్నీరు కారుస్తారు. అందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. కొందరు ఫాన్స్ తమ ట్వీట్లతో బేడీపై విరుచుకుపడుతున్నారు.

 షెఫాలీని అలా చూడటంతో భాదగా అనిపించింది :

షెఫాలీని అలా చూడటంతో భాదగా అనిపించింది :

ఆసీస్‌ దిగ్గజ బౌలర్‌ బ్రెట్‌ లీ.. ఐసీసీకి రాసిన తన కాలమ్‌లో ఈ విషయంపై ప్రస్తావించాడు. 'షెఫాలీ ఏడ్వడం నాకు బాధనిపించింది. మ్యాచ్‌ ముగిసిపోయాక ఆమె కన్నీట పర్యంతం కావడం నాకు చాలా కష్టంగా అనిపింది. షెఫాలీ ఓ గర్వించదగ్గ క్రికెటర్‌. ఆస్ట్రేలియాలో ఆమె ప్రదర్శన అద్భుతం. తొలి టోర్నమెంట్‌ ఆడటానికి ఇక్కడకు వచ్చిన ఆమె తన టాలెంట్‌తో ఆకట్టుకుంది. ఇక్కడ నుంచి ఆమె మరింత పరిణితి సాధిస్తుందని అనుకుంటున్నా' అని లీ పేర్కొన్నారు.

ఇక్కడితో క్రికెట్‌ ఏమీ ముగిసిపోలేదు:

ఇక్కడితో క్రికెట్‌ ఏమీ ముగిసిపోలేదు:

ఈ టోర్నమెంట్‌లో సాధించిన అనుభవంతో షెఫాలీ మరింత రాటుదేలడం ఖాయం. ఆస్ట్రేలియాలో ఆడే తదుపరి టోర్నీల్లో ఆమె చేసే భారీ స్కోర్లు ఎవ్వర్నీ ఆశ్చర్యపరచకపోవచ్చు. సానుకూల ధోరణితో ముందుకు సాగుతుందనే అనుకుంటున్నా. ఇది భారత మహిళలకు తీవ్ర నిరాశను మిగిల్చిన రాత్రి. కానీ.. వారు మరింత ఆశావాహ ధృక్పథంతో రాటుదేలతారు. ఇక్కడితో క్రికెట్‌ ఏమీ ముగిసిపోలేదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనుకోండి' అని లీ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, March 9, 2020, 17:07 [IST]
Other articles published on Mar 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X