న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐపీఎల్ 2020: పంజాబ్ బ్యాటింగ్ కోచ్‌గా వసీం జాఫర్

IPL Auction 2020 : Kings XI Punjab Appoints Wasim Jaffer As Batting Coach ! || Oneindia Telugu
Domestic stalwart Wasim Jaffer joins Kings XI Punjab as batting coach

హైదరాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు పంజాబ్ యాజమాన్యం తన అధికారిక వెబ్‌సైట్లో రాసుకొచ్చింది. తన కోచింగ్ సిబ్బందిలోని ఇతర సభ్యులతో తాజాగా జాఫర్ పేరుని కూడా చేర్చింది.

దీనిపై వసీం జాఫర్ మాట్లాడుతూ "నేను కుంబ్లేకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అతను నన్ను సంప్రదించాడు. టీమిండియా తరుపున అతడి సారథ్యంలో ఆడటం ఒక గౌరవం. అతడి నుంచి ఎంతో నేర్చుకున్నాను. నేను ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో కోచింగ్ చేస్తున్నప్పటికీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అకాడమీలో బ్యాటింగ్ కోచ్) ఇదొక మంచి అవకాశం. ఈ అనుభవం కోసం నేను ఎదురు చూస్తున్నాను" అని అన్నాడు.

2020లో పాకిస్థాన్ పర్యటనకు ఎంసీసీ జట్టు: కెప్టెన్‌గా కుమార సంగక్కర2020లో పాకిస్థాన్ పర్యటనకు ఎంసీసీ జట్టు: కెప్టెన్‌గా కుమార సంగక్కర

ఐపీఎల్‌లోనూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున

ఐపీఎల్‌లోనూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున

కాగా, ఐపీఎల్‌లోనూ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున 8 మ్యాచ్‌లాడి 130 పరుగులు చేశాడు. ఈ ఏడాది మే నెలలో మిర్‌పుర్‌లోని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు చెందిన అకాడమీలో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. వసీం జాఫర్ దేశవాళీ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాడు.

రంజీ క్రికెట్‌లో 19 సీజన్లు ముంబైకి ప్రాతినిథ్యం

రంజీ క్రికెట్‌లో 19 సీజన్లు ముంబైకి ప్రాతినిథ్యం

రంజీ క్రికెట్‌లో 19 సీజన్లు ముంబైకి ప్రాతినిథ్యం వహించిన జాఫర్ చివరగా విదర్భ జట్టు తరుపున ఆడాడు. ఒక రంజీ సీజన్‌లో రెండు సార్లు వెయ్యికి పైగా పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా అరుదైన ఘనత సాధించాడు. జాఫర్ 40 ఏళ్లు పైబడిన తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన తొలి భారత క్రికెటర్‌గా, అదే విధంగా తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

1996-97లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం

1996-97లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం

1996-97లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన వసీం జాఫర్ ఇప్పటివరకు మొత్తం 251 ఫస్ట్‌క్లాస్ మ్యాచుల్లో యావరేజి 51.42తో 19 వేల పరుగులు చేశాడు. ఇందులో 57 సెంచరీలు, 88 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో జాఫర్ అత్యధిక స్కోరు 314 పరుగులు. భారత జట్టు తరఫున 2000లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు.

2008లో అదే జట్టుతో

2008లో అదే జట్టుతో

2008లో అదే జట్టుతో తన ఆఖరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు.1996-2015 మధ్య కాలంలో ముంబై జట్టు తరఫున రంజీల్లో ఆడాడు. మొత్తం 31 టెస్టు మ్యాచ్‌లాడిన జాఫర్ 1,944 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి.

Story first published: Thursday, December 19, 2019, 12:24 [IST]
Other articles published on Dec 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X