న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌కు ఎవరొచ్చినా పర్వాలేదు.. సిరీస్ గెలవడమే లక్ష్యం!!

Doesnt matter which Sri Lanka players visit Pakistan says Javed Miandad

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌కు శ్రీలంక ఆటగాళ్లు ఎవరొచ్చినా పర్వాలేదు. సిరీస్‌ గెలవడంపైనే దృష్టిపెట్టాలని పాకిస్తాన్‌ క్రికెటర్లకు ఆ దేశ మాజీ కెప్టెన్ జావేద్‌ మియాందాద్‌ సూచించాడు. వన్డే, టీ20 సిరీస్‌ల కోసం లంక జట్టు పాకి​స్తాన్‌లో పర్యటించాల్సి ఉంది. లంక కెప్టెన్‌లు లసిత్‌ మలింగ, దిముత్‌ కరుణరత్నె సహా పది మంది సీనియర్‌ ఆటగాళ్లు పాకిస్థాన్‌ పర్యటనను నిరాకరించారు. భద్రతా కారణాల దృష్ట్యా అందరూ పాక్‌ పర్యటనను బహిష్కరించారు.

<strong>41బంతుల్లో సెంచరీ.. టీ20ల్లో రికార్డు బద్దలు కొట్టిన స్కాట్లాండ్‌ బ్యాట్స్‌మన్‌</strong>41బంతుల్లో సెంచరీ.. టీ20ల్లో రికార్డు బద్దలు కొట్టిన స్కాట్లాండ్‌ బ్యాట్స్‌మన్‌

ఆడాలనుకుంటే రండి లేదా పోండి:

ఆడాలనుకుంటే రండి లేదా పోండి:

లంక దేశ క్రీడా మంత్రి ఆటగాళ్లతో స్వయంగా మాట్లాడినా.. పాక్‌కు వెళ్లేందుకు ఆటగాళ్లు విముఖత వ్యక్తం చేశారు. అయితే సిరీస్‌ను తటస్థ వేదికపై నిర్వహించాలని లంక బోర్డు కోరగా.. పాక్‌ తిరస్కరించింది. ఎట్టిపరిస్థితులల్లో వేదిక మార్చే ప్రసక్తే లేదు. ఆడాలనుకుంటే రండి లేదా పోండి అని గట్టిగా చెప్పింది. దీంతో పాక్ పర్యటనకు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఎంపిక చేసింది.

పాక్‌కు ఎవరొచ్చినా పర్వాలేదు:

పాక్‌కు ఎవరొచ్చినా పర్వాలేదు:

ద్వితీయ శ్రేణి ఆటగాళ్లను శ్రీలంక పంపనుండడంతో జావేద్‌ మియాందాద్‌ మాట్లాడుతూ... 'ఎటువంటి శ్రీలంక ఆటగాళ్లు ఇక్కడికి వస్తున్నారనేది ముఖ్యం కాదు. ఆటగాళ్లు ఎవరొచ్చినా.. పాక్‌ ఆటగాళ్లు సిరీస్‌ గెలవడంపైనే దృష్టి పెట్టండి. ప్రత్యర్థిపై ఉత్తమ ప్రదర్శన కనబరిచేందుకు ప్రయత్నించాలి. ఆటగాళ్లకు అంతర్జాతీయ మ్యాచులు ఎంతో ముఖ్యం. ఒక సిరీస్‌ ఉందంటే ఆటగాళ్లు వెళ్లాలి కానీ.. ఆడం అనడం సరైనది కాదు. పాక్‌ పర్యటనను నిరాకరించిన ఆటగాళ్లపై శ్రీలంక బోర్డు చర్యలు తీసుకోవాలి' అని కోరాడు.

ఐసీసీ కమిటీ:

ఐసీసీ కమిటీ:

ఈ నెల 27 నుంచి పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం మ్యాచ్‌ రిఫరీలను నియమించే ముందు పాక్‌లోని భద్రతా పరిస్థితులను ఐసీసీ పరిశీలించనుంది. పాక్‌లో ప్రస్తుత క్రికెట్‌ పరిస్థితుల, భద్రతా చర్యలపైనా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ పర్యటనలో శ్రీలంక ఆటగాళ్లను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకునే ప్రమాదం ఉందని శ్రీలంక ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం అందిన విషయం తెలిసిందే.

ప్రపంచకప్‌ ప్రభావం: శ్రీలంకతో సిరీస్‌.. సీనియర్లపై వేటు!!

శ్రీలంక జట్టుపై దాడులు

శ్రీలంక జట్టుపై దాడులు

2009లో పాక్‌లో పర్యటిస్తున్న శ్రీలంక టెస్టు జట్టుపై దాడులు జరిగాయి. బస్సులో ప్రయాణిస్తున్న లంక క్రికెటర్లపై దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో బస్సులోని శ్రీలంక క్రికెటర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత నుంచి ఏ క్రికెట్‌ జట్టు కూడా పాకిస్తాన్‌లో పర్యటించే సాహసం చేయలేదు. దీంతో తటస్థ వేదికల్లోనే పాక్‌ క్రికెట్‌ ఆడుతూ వస్తోంది. శ్రీలంక సిరీస్‌తో పాక్‌లో క్రికెట్‌ పునర్వైభం తీసుకరావాలని పాక్‌ భావిస్తోంది.

Story first published: Tuesday, September 17, 2019, 10:13 [IST]
Other articles published on Sep 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X