Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రపంచకప్‌ ప్రభావం: శ్రీలంకతో సిరీస్‌.. సీనియర్లపై వేటు!!

Pakistan drop Mohammad Hafeez, Shoaib Malik for Sri Lanka series

కరాచీ: ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చెత్త ప్రదర్శన చేయడంతో ప్రధాన కోచ్ మరియు చీఫ్ సెలెక్టర్ మిస్బా ఉల్ హక్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం మొదలెట్టేసాడు. శ్రీలంకతో సిరీస్‌లో భాగంగా జరిగే ట్రైనింగ్‌ క్యాంప్‌ కోసం ఆటగాళ్లను పాక్ సెలక్టర్‌గా మిస్బా ఎంపిక చేసాడు. ఈ ఆటగాళ్ల జాబితాలో పాకిస్తాన్ సీనియర్ ఆటగాళ్లపై వేటు వేసాడు. జట్టును గాడిలో పెట్టడంకోసమే మిస్బా ఇలా వ్యవహరించినట్టు తెలుస్తోంది.

ప్రపంచకప్‌ ప్రభావం:

ప్రపంచకప్‌ ప్రభావం:

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ చెత్త ప్రదర్శనతో సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్‌లో పాక్‌ కెప్టెన్, సీనియర్‌ ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి. దీంతో కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌తో పాటు సీనియర్‌ ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందిపై వేటు వేయాలని అభిమానులతో పాటు పాక్‌ మాజీ క్రికెటర్లు డిమాండ్‌ చేశారు. పాక్‌ క్రికెట్‌ జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అన్నాడు.

ట్రైనింగ్‌ క్యాంప్‌:

ట్రైనింగ్‌ క్యాంప్‌:

ప్రక్షాళనలో భాగంగా మొదటగా కోచ్‌పై వేటు వేసి.. మిస్బాను ప్రధాన కోచ్‌గా, చీఫ్‌ సెలక్టర్‌గా నియమించింది. చీఫ్‌ సెలక్టర్‌గా నియమించబడ్డాక మిస్బా తన మార్క్‌ చూపించాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం పీసీబీ ఓ ట్రైనింగ్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్‌ క్యాంప్‌ కోసం పీసీబీ సోమవారం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో పాక్ సీనియర్‌ ఆటగాళ్లు మహ్మద్‌ హఫీజ్‌, షోయాబ్‌ మాలిక్‌లను ఎంపిక చేయలేదు. దీంతో మిస్బా తన మార్క్ చూపించాడు.

కెప్టెన్‌గా సర్ఫరాజ్‌:

కెప్టెన్‌గా సర్ఫరాజ్‌:

సర్ఫరాజ్‌ అహ్మద్‌ను మాత్రం కెప్టెన్‌గా కొనసాగించారు. ఇక బాబర్‌ అజమ్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ శిక్షణా శిబిరం సెప్టెంబర్ 18 నుండి లాహోర్లోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ప్రారంభమవుతుంది. శ్రీలంకతో జరగబోయే టీ20 సిరీస్‌కు మాలిక్‌ను ఎంపిక చేయకపోవడంతో.. అతడి భవిష్యత్‌ ఏంటో ప్రశ్నార్థకంగా మారింది.

10 మంది ఆటగాళ్లు నిరాకరణ:

10 మంది ఆటగాళ్లు నిరాకరణ:

శ్రీలంకతో ఈ నెల 27 నుంచి స్వదేశంలో వన్డే, టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 21న మిస్బా శ్రీలంక సిరీస్ కోసం జట్లను ఎంపికచేయనున్నాడు. పాక్ వన్డే జట్టు సెప్టెంబర్ 24న కరాచీకి వెళ్తుంది. అక్కడ మొదటి వన్డే సెప్టెంబర్ 27న జరుగుతుంది. ఈ సిరీస్ కోసం లంక జట్టులోని 10 మంది ఆటగాళ్లు నిరాకరించిన విషయం తెలిసిందే.

Team:

Sarfaraz Ahmed (c), Babar Azam (vc), Abid Ali, Ahmed Shehzad, Asif Ali, Faheem Ashraf, Fakhar Zaman, Haris Sohail, Hasan Ali, Iftikhar Ahmed, Imad Wasim, Imam-ul-Haq, Mohammad Amir, Mohammad Hasnain, Mohammad Nawaz, Mohammad Rizwan, Shadab Khan, Umar Akmal, Usman Shinwari, Wahab Riaz.

Story first published: Tuesday, September 17, 2019, 8:58 [IST]
Other articles published on Sep 17, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+