న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ చేసింది సెహ్వాగ్ కాదు.. ఎవరో తెలుసా?!!

Do you know who scored fastest century in Test cricket?, Not Virender Sehwag

హైదరాబాద్: డాషింగ్ ఓపెనర్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు టీమిండియా మాజీ ఆటగాడు వీరేందర్ సెహ్వాగ్. ఆ కాలంలో విధ్వంసకర ఆటగాడు. ఫార్మాట్‌ ఏదైనా మొదటి బంతి నుంచే బౌలర్లకు చుక్కలు చూపించేవాడు. అప్పట్లో పటిష్ట బౌలింగ్ కలిగిన ఆసీస్ బౌలర్లను కూడా ఓ ఆటాడుకున్నాడు. బ్రెట్ లీ లాంటి భయంకర బౌలర్‌లు వేసిన మొదటి బంతికి కూడా సిక్సర్ బాదేవాడు. ఈ బాదుడుతోనే సెహ్వాగ్ టెస్ట్ క్రికెట్‌లో ఓపెనింగ్‌లో విప్లవాత్మక మార్పులు చేశాడు.

అలా ఆడటం వధువు లేని పెళ్లి లాంటిది .. అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!!అలా ఆడటం వధువు లేని పెళ్లి లాంటిది .. అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!!

మొదటి స్థానంలో కపిల్, అజారుద్దీన్:

మొదటి స్థానంలో కపిల్, అజారుద్దీన్:

వీరేందర్ సెహ్వాగ్ తన టెస్టు కెరీర్‌లో 82.83 స్ట్రైక్‌రేటుతో 8,586 పరుగులు చేసాడు. ఈ ఫార్మాట్‌లో ఇలాంటి గణాంకాలు చాలా అరుదు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసి రికార్డు సృష్టించిన సెహ్వాగ్.. టెస్టుల్లో మాత్రం ఆ ఘనత సాధించలేకపోయాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసి ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్లలో అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ చేసిన జాబితాలో మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహ్మద్ అజారుద్దీన్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. వీరిద్దరు 74 బంతుల్లో టెస్టుల్లో సెంచరీలు చేశారు.

అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ చేసింది మెక్‌కల్లమ్:

అత్యంత వేగంగా టెస్టుల్లో సెంచరీ చేసింది మెక్‌కల్లమ్:

ఓవరాల్‌గా టెస్టుల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు కివీస్ మాజీ ఓపెనర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ పేరిట ఉంది. అతడు 54 బంతుల్లో సెంచరీ నమోదు చేసాడు. అంతకుముందు ఈ రికార్డు సర్ వీవ్ రిచర్డ్స్, మిస్బా ఉల్ హక్‌ల పేరిట ఉండేది. వీరిద్దరూ 56 బంతుల్లో సెంచరీ సాధించారు. ఆ రికార్డును మెక్‌కల్లమ్ బద్దలుకొట్టాడు. 2016లో తన కెరీర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన మెక్‌కల్లమ్.. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. ఆ మ్యాచులో 79 బంతుల్లో 145 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 183.54 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన మెక్‌కల్లమ్ తన ఇన్నింగ్స్‌లో 21 ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ (57) జాక్ గ్రెగొరీ (67) శివనారైన్ చందర్‌పాల్ (69) వరుసగా ఉన్నారు.

31 బంతుల్లో డివిలియర్స్ ఒన్డే సెంచరీ:

31 బంతుల్లో డివిలియర్స్ ఒన్డే సెంచరీ:

వన్డేల్లో అత్యంత చిన్న వయసులో సెంచరీ నమోదు చేసిన రికార్డు ప్రస్తుతం పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉంది. 16 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌‌లోకి అరంగేట్రం చేసిన తర్వాత మ్యాచ్‌లోనే ఈ ఫీట్‌ సాధించాడు. 1996లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో అఫ్రిది కేవలం 37 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. 2014లో న్యూజిలాండ్ హిట్టర్ కోరె అండర్సన్ 36 బంతుల్లో 100 పరుగుల మైలురాయిని అందుకుని బ్రేక్ చేశాడు. ఆ తర్వాత ఏడాది కేవలం 31 బంతుల్లో దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఏబీ డివిలియర్స్ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు.

Story first published: Monday, May 18, 2020, 19:51 [IST]
Other articles published on May 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X