న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

12 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కడంపై దినేశ్ కార్తీక్ (వీడియో)

Dinesh Karthik: Very excited, dream come true to be part of this World Cup team

హైదరాబాద్: సుదీర్ఘకాలం తర్వాత వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కడంపై టీమిండియా వికెట్ కీపర్ సంతోషం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి వన్డే వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌కప్‌లో ఆడబోయే జట్టుని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. మొత్తం 15 మందితో కూడిన భారత జట్టుని టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ జట్టులో బ్యాకప్ వికెట్ కీపర్‌గా దినేశ్ కార్తీక్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు. వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో చోటు దక్కించుకోవడంతో తన కల సాకారమైందని దినేశ్ కార్తీక్ అన్నాడు. "వరల్డ్‌కప్‌కు ఎంపిక అవడం చాలా సంతోషంగా ఉంది. సుదీర్ఘకాలం తర్వాత ఈ జట్టులో భాగస్వామిని అయినందుకు నా కల సాకారమైంది" అని దినేశ్‌ కార్తీక్‌ చెప్పాడు.

కేకేఆర్ ట్విట్టర్‌లో వీడియో

ఇందుకు సంబంధించిన వీడియోని కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌ జట్టు తన అధికారిక ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2019 సీజన్‌లో దినేశ్ కార్తీక్‌ కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే. బ్యాకప్ వికెట్ కీపర్ విషయంలో గత కొంతకాలంగా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

దినేశ్ కార్తీక్‌కే ఓటేయడానికి కారణం

దినేశ్ కార్తీక్‌కే ఓటేయడానికి కారణం

అయితే, చివరకు సెలక్టర్లు దినేశ్ కార్తీక్‌కే ఓటేయడానికి కారణం అతడి అనుభవమే. ముఖ్యంగా ఒత్తిడిని ఎదుర్కొనడంలో దినేశ్ కార్తీక్ దిట్ట అని ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వెల్లడించారు. వరల్డ్ కప్‌లో భారత వికెట్ కీపర్‌గా ధోనినే వికెట్ కీపింగ్ చేస్తాడని... ఒక‌వేళ ధోని గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమైతే అప్పుడు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను దినేశ్ కార్తీక్ నిర్వ‌ర్తిస్తాడని తెలిపాడు.

దినేశ్‌ కార్తీక్‌కు ఇది రెండో వరల్డ్‌కప్

దినేశ్‌ కార్తీక్‌కు ఇది రెండో వరల్డ్‌కప్

33 ఏళ్ల దినేశ్‌ కార్తీక్‌కు ఇది రెండో వరల్డ్‌కప్ కావడం విశేషం. 2007లో దినేశ్‌ కార్తీక్‌ తన మొట్టమొదటి వరల్డ్‌కప్‌ను ఆడాడు. ఆ తర్వాత మళ్లీ 12 ఏళ్లకు వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. మే30 నుంచి ఆరంభమయ్యే వరల్డ్‌కప్‌కు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోంది. జులై 14న లార్డ్స్ వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మెగా టోర్నీలో జూన్‌ 5న దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Story first published: Tuesday, April 16, 2019, 18:25 [IST]
Other articles published on Apr 16, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X