న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సైనీ స్థానంలో బౌలింగ్.. రోహిత్‌ను ట్రోల్‌ చేసిన దినేశ్‌ కార్తిక్‌! ఏమైందో తెలియదు కానీ!

Dinesh Karthik trolls Rohit Sharma after Hitman bowled one delivery

సిడ్నీ: బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న నాలుగ‌వ టెస్ట్ తొలి రోజున టీమిండియా పేసర్ న‌వ‌దీప్ సైనీ గాయ‌ప‌డ్డ విష‌యం తెలిసిందే. గ‌జ్జ‌ల్లో తీవ్ర నొప్పి రావ‌డంతో అత‌ను మైదానం నుంచి త‌ప్పుకున్నాడు. 36వ ఓవర్‌ బౌలింగ్‌ చేస్తుండగా ఇబ్బంది పడడంతో ఫిజియో వచ్చి పరీక్షించాడు. ఆపై సైనీ మైదానం వీడాడు. ఈ ఓవర్‌లో సైనీ 5 బంతులు మాత్రమే వేయగా.. ఆ ఓవర్‌లో ఒక బాల్ మిగిలిపోవడంతో కెప్టెన్‌ అజింక్య రహానే బంతిని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ‌కు అందించాడు. చివరి బంతిని రోహిత్ పూర్తి చేశాడు.

రోహిత్‌ను ట్రోల్‌ చేసిన డీకే:

రోహిత్‌ శర్మ వేసిన ఆ బంతిని ఎదుర్కొన్న మార్నస్‌ లబుషేన్ ‌(108) కట్‌ షాట్‌ ఆడి సింగిల్‌ తీశాడు. అయితే రోహిత్ బౌలింగ్‌ చేయడాన్ని వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ సరదాగా ట్వీట్‌ చేశాడు. భారత ప్రధాన పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ.. రోహిత్ బౌలింగ్‌ను చూసి నేర్చుకోవాలన్నాడు. జట్టులో కొత్త ఫాస్ట్‌ బౌలర్‌ వచ్చాడని ట్వీట్ చేశాడు. అంతేకాదు ముగ్గుర్నీ ట్యాగ్‌ చేసి ఓ జిఫ్‌ ఫైల్‌ను పోస్టు చేశాడు. తర్వాత ఏమైందో తెలియదు కానీ కార్తిక్‌ ఆ పోస్టును తొలగించాడు. అయితే అప్పటికే ఆ ట్వీట్ వైరల్‌గా మారింది.

గాయంపై ఇంకా స్పష్టత లేదు:

గాయంపై ఇంకా స్పష్టత లేదు:

మ్యాచ్ అనంతరం న‌వ‌దీప్ సైనీకి టీమిండియా మేనేజ్మెంట్ స్కానింగ్ చేసింది. అయితే ఇవాళ రెండ‌వ రోజు కూడా సైనీ.. బౌలింగ్ చేసేందుకు మైదానంలోకి రాలేదు. అతనికి అయిన గాయం తీవ్రంగా ఉండడంతోనే సైనీ బౌలింగ్ చేయలేదని తెలుస్తోంది. సైనీ ఫిట్‌గా లేక‌పోవ‌డం భార‌త క్రికెట్‌కు ఇదో చేదువార్తే. మరోవైపు సైనీ గాయంపై ఇంకా స్పష్టత రాలేదు. అతడిని వైద్య పరీక్షలకు తరలించినట్లు బీసీసీఐ శుక్రవారం ట్వీట్‌ చేసింది.

కార్తీక్‌పై వేటు తప్పదా?:

కార్తీక్‌పై వేటు తప్పదా?:

గత రెండు ఐపీఎల్‌ సీజన్లలో కోల్‌కతా నైట్‌ రైడర్స్ ‌(కేకేఆర్‌) జట్టుకు సారథిగా చేసిన దినేశ్‌ కార్తిక్‌ పూర్తిగా విఫలమయ్యాడు. 2020లో మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతలను వదులుకున్నాడు. ఐపీఎల్ 2021కి ముందు వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్ (7.4కోట్లు)ను వదులుకోవాలని కేకేఆర్‌ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు తెలిసింది. జట్టులో ప్రతిభావంతులైన వికెట్‌ కీపర్లు టామ్‌ బాంటన్‌, నిఖిల్‌ నాయక్‌లు ఉన్నారు. అందుకే కార్తీక్‌ను వదులుకోవాలని చూస్తోంది.

India vs Australia: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. భారత్ 62/2!!

Story first published: Saturday, January 16, 2021, 12:41 [IST]
Other articles published on Jan 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X