న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Australia: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. భారత్ 62/2!!

Brisbane Test: Rain delays start of play after Tea

బ్రిస్బేన్‌: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు రెండో రోజు ఆటలో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా భారత్ తొలి ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ నిలిచిపోయింది. రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఛెతేశ్వర్‌ పుజారా (8), అజింక్య రహానే (2) క్రీజులో ఉన్నారు. టీ బ్రేక్ అనంతరం భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ఆగిపోయింది. అయితే ప్రస్తుతం వర్షం ఆగిపోయింది. మైదానాన్ని గ్రౌండ్‌స్టాఫ్ సిద్ధం చేస్తున్నారు. మ్యాచ్ త్వరలో ప్రారంభం కానుంది.

అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌ ఆదిలోనే ఓపెనర్ శుభ్‌మన్ ‌ గిల్ ‌(7) వికెట్‌ కోల్పోయింది. పాట్ కమిన్స్‌ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌ చేతికి చిక్కాడు. ఆపై రోహిత్ శర్మ ‌(44; 74 బంతుల్లో 6x4), ఛెతేశ్వర్‌ పుజారాతో కలిసి రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. తొలుత నెమ్మదిగా ఆడినా.. ఆపై వేగం పెంచి టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

అయితే అర్ధ శతకానికి చేరువైన హిట్‌మ్యాన్‌ను స్పిన్నర్ నాథన్ లైయన్‌ బోల్తా కొట్టించాడు. ఊరించే బంతి వేయడంతో భారీ షాట్‌ ఆడేందుకు యత్నించి మిచెల్‌ స్టార్క్‌ చేతికి దొరికిపోయాడు. దీంతో భారత్‌ 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ ఔటైన తర్వాత రహానే బ్యాటింగ్‌కు దిగాడు. పుజారా, రహానే మెల్లగా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళుతున్నారు. క్రీజ్‌లో పాతుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ.. ఆసీస్‌ బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ఈ జోడి 37 బంతుల్లో రెండు పరుగులు చేసింది.

పాండ్యా సోదరుల ఇంట విషాదం.. టోర్నీ మధ్యలోంచి ఇంటికెళ్లిన కృనాల్!!పాండ్యా సోదరుల ఇంట విషాదం.. టోర్నీ మధ్యలోంచి ఇంటికెళ్లిన కృనాల్!!

Story first published: Saturday, January 16, 2021, 11:36 [IST]
Other articles published on Jan 16, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X