న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఈడెన్‌లో 97 నాటౌట్: వరల్డ్‌కప్ జట్టులో దినేశ్ కార్తీక్ ఎంపిక సరైందే

IPL 2019 : Dinesh Karthik's 97 Runs Proves He Deserved World Cup Spot Says Fans || Oneindia Telugu
Dinesh Karthiks unbeaten 97 proves he deserved World Cup spot, fans back KKR skippers selection

హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ 97(7 ఫోర్లు, 9 సిక్సులు)తో సూపర్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ జట్టుని మాత్రం గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

వరుణ్ ఆరోన్ వేసిన తొలి ఓవర్ మూడో బంతికి క్రిస్ లిన్(0) క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత వరుణ్ ఆరోన్ వేసిన ఐదో ఓవర్ చివరి బంతికి శుభ్‌మాన్ గిల్(14) కూడా క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో కేకేఆర్ 31 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత నితీశ్ రానా(21) శ్రేయస్ గోపాల్ వేసిన 9వ ఓవర్ రెండో బంతికి వరుణ్ ఆరోన్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

అనంతరం సునీల్‌ నరైన్‌(11), ఆండ్రీ రసెల్‌(14)లు సైతం స్వల్ప స్కోరుకే పెవిలియన్ ‌ చేరారు. ఈ సమయంలో కెప్టెన్ దినేశ్ కార్తీక్ వికెట్ కాపాడుకుంటూ ఒంటరి పోరాటం చేసి కేకేఆర్ సముచితమైన స్కోరు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం 176 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి చేధించడంతో కేకేఆర్ ఓటమిపాలైంది.

కేకేఆర్ ఓడినప్పటికీ దినేశ్ కార్తీక్ అద్భుత ఇన్నింగ్స్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్ జట్టులో దినేశ్ కార్తీక్ బ్యాకప్ కీపర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఒక్క ఇన్నింగ్స్‌ చాలు వరల్డ్‌కప్‌లో దినేశ్ కార్తీక్‌ ఎంపిక సరైందేనని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Story first published: Friday, April 26, 2019, 18:16 [IST]
Other articles published on Apr 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X