న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఉత్కంఠకు తెరవీడింది: సాహా బదులు కీపర్‌గా కార్తీక్

Dinesh Karthik replaces injured Wriddhiman Saha for Afghanistan Test

హైదరాబాద్: అఫ్గానిస్తాన్‌తో జరిగే ఏకైక చారిత్రాత్మక టెస్టుకు భారత వికెట్‌ కీపర్‌ ఎవరనే ఉత్కంఠకు తెరవీడింది. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన వృద్దిమాన్‌ సాహా స్థానంలో మరో​ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌‌ను తీసుకుంటూ బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. ఐపీఎల్‌లో కోల్‌కతా నైటరైడర్స్‌తో జరిగిన క్యాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన సాహా కుడి బొటనవేలికి గాయమైంది.

దీంతో అఫ్గాన్‌తో జరిగే టెస్టుకు తాను సిద్దంగా లేనట్లు సాహా ఇటీవల ప్రకటించాడు. ఈ నేపథ్యంలో సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌కు బీసీసీఐ అవకాశం కల్పించింది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ' అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్ట్‌కు వృద్దిమాన్‌ సాహా దూరమయ్యాడు. అతని స్థానంలో సెలక్టర్లు దినేశ్‌ కార్తీక్‌ను ఎంపిక చేశారు' అని ట్వీట్‌లో పేర్కొంది.

బెంగళూరు వేదికగా జూన్‌ 14న ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ టెస్టుల్లో అఫ్గాన్‌కు అరంగేట్ర మ్యాచ్ అన్న విషయం తెలిసిందే‌. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు రోహిత్‌ శర్మ, భువనేశ్వర్‌ కుమార్, జస్ప్రీత్‌ బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. కోహ్లి గైర్హాజరితో భారత జట్టుకు అజింక్యా రహానే కెప్టెన్సీ వహించనున్నాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడుతూ.. గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమైన కోహ్లీ మళ్లీ శిక్షణ మొదలుపెట్టాడు. జట్టులో మార్పులు చేర్పుల అనంతరం అఫ్ఘన్ యువ బౌలర్ల రషీద్, ముజీబ్‌లను ఎదుర్కొనేందుకు శిక్షణ మొదలుపెట్టింది.

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో తలపడే టీమిండియా:
1. అజింక్య రహానే(కెప్టెన్)
2. శిఖర్ ధావన్
3. మురళీ విజయ్
4. కేఎల్ రాహుల్
5. చతేశ్వర్ పుజారాః
6. కరుణ్ నాయర్
7. దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్)
8. రవిచంద్రన్ అశ్విన్,
9. రవీంద్ర జడేజా
10. కుల్దీప్ యాదవ్
11. ఉమేశ్ యాదవ్
12. మహ్మద్ షమీ
13. హార్దిక్ పాండ్య
14. ఇషాంత్ శర్మ
15. శార్ధూల్ ఠాకూర్.

అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టులో భారత్‌తో తలపడనున్న అఫ్గాన్ జట్టు:
1. అస్గర్ స్టానిక్‌జాల్
2. మొహమ్మద్ షాజాద్
3. జావేద్ అహ్మది
4. రహ్మ త్ సింగ్
5. ఇహ్‌సానుల్పాహ జనత్
6. నజీర్మ జమాల్
7. హస్మతుల్లా షాహిదీ
8. అఫ్సర్ జజాయ్
9. మొహమ్మద్ నబీ
10. రషీద్ ఖాన్
11. జహీర్ ఖాన్
12. హమ్జా హోటక్
13. సయ్యద్ అహ్మద్ షిర్జాద్
14. యామిన్ అహ్మద్‌జై
15. వఫాదర్
16. ముజీబ్ ఉర్ రహ్మన్

Story first published: Saturday, June 2, 2018, 16:15 [IST]
Other articles published on Jun 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X