న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శుభ్‌మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్

 Dinesh Karthik picks Virat Kohlis ‘first choice’ replacement in T20Is

న్యూఢిల్లీ: టీమిండియా యువ ప్లేయర్ రాహుల్ త్రిపాఠిపై వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ప్రశంసల జల్లు కురిపించాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వారసుడు అతనేనని స్పష్టం చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో టీ20లో శుభ్‌‌మన్ గిల్ సెంచరీ చేసినా.. ఆ ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేసింది త్రిపాఠినే అని స్పష్టం చేశాడు. అతను ఆడిన క్విక్ ఫైర్‌ నాక్స్‌ను మరిచిపోవద్దని అభిమానులు కోరాడు.

న్యూజిలాండ్‌తో మూడో టీ20లో రాహుల్ త్రిపాఠి 22 బంతుల్లో నాలుగు బౌండరీలు, మూడు సిక్స్‌లతో 44 పరుగులతో భారత ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. ఈ సపోర్ట్‌తో క్రీజులో సెట్ అయిన గిల్ విధ్వంసకర సెంచరీతో చెలరేగి భారత్‌కు భారీ స్కోర్‌తో పాటు చారిత్రాత్మక విజయాన్నందించాడు.

డియర్ ఫ్యాన్స్.. మతిపరుపు వద్దు..

ఈ ఇన్నింగ్స్‌పై క్రిక్‌బజ్‌తో మాట్లాడిన దినేశ్ కార్తీక్.. రాహుల్ త్రిపాఠిని త్వరగా మరిచిపోవద్దని ఫ్యాన్స్‌ను కోరాడు. 'క్రికెట్ ఫ్యాన్స్, భారత క్రికెట్‌ను క్లోజ్‌గా ఫాలో అయ్యేవారందరూ దయచేసి సమీప భవిష్యత్తులో మతిమరుపు కలిగి ఉండకండి. ఎందుకంటే త్రిపాఠి పెద్ద ఆటగాడిని రిప్లేస్ చేయనున్నాడు. అప్పుడు అతను 40, 30 పరుగులే చేశాడని అనవద్దు.

అతను ఆడిన పరిస్థితులు.. ఆడిన ఉద్దేశాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిస్వార్థమైన ఆటగాడు రాహుల్ త్రిపాఠి. అతని కెరీర్‌ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్నా.. దూకుడు, అటాకింగ్ ఆప్షన్‌ను ఎంచుకున్నాడు. కెరీర్‌కు రిస్క్ అని తెలిసినా జట్టు కోసం, ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ధాటిగా ఆడాడు.

విరాట్ వారసుడు అతనే..

విరాట్ వారసుడు అతనే..

మరో మూడు నెలలు, 6 నెలల సమయం తర్వాత త్రిపాఠి ఆడిన ఈ ఇన్నింగ్స్‌ను మరిచిపోకూడదని ఫ్యాన్స్‌ను కోరుతున్నాను. అతను ఐపీఎల్‌లో రాణించినా, విఫలమైనా.. భారత జట్టులో మూడో స్థానానికి అతను సరైన వాడు. విరాట్ కోహ్లీ జట్టులో కొనసాగితే ఒకే కానీ అతను లేకుంటే మాత్రం ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా రాహుల్ త్రిపాఠికి మాత్రమే ఉంది. అతనికే అవకాశం ఇవ్వాలి.

అంతేకానీ ఎక్కడో రాణించిన మరెవరినో తీసుకురావద్దు.కెరీర్ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నా.. జట్టు కోసం రిస్క్ చేసి ఆడుతున్నాడు.

భయం లేని ఆటగాడు..

భయం లేని ఆటగాడు..

శ్రీలంకతో, న్యూజిలాండ్‌తో అసాధారణ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతనేం వరుసగా అవకాశాలు అందుకున్న ఆటగాడేం కాదు. అయినా తన బ్యాటింగ్‌లో దూకుడు కనబరుస్తూ రిస్క్ ఆప్షన్ ఎంచుకున్నాడు. కోచ్, కెప్టెన్ కోరుకున్నట్లు ఆడాడు. దూకుడుగా ఆడటం అతని డీఎన్‌ఏలోనే ఉంది.

మైదానంలోకి దిగాడంటే పరిస్థితులతో సంబంధం లేకుండా, ఎంతటి పెద్ద మ్యాచ్ అయినా పట్టించుకోకుండా బౌలర్లను బాదుతాడు. ఈ తరహా ఆటగాళ్లు జట్టులో ఉండటం చాలా ముఖ్యం. బిగ్ మ్యాచ్‌ల్లో ఇలాంటి ఆటగాళ్లు ఉపయోగపడుతారు'అని దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, February 3, 2023, 11:41 [IST]
Other articles published on Feb 3, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X