న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దినేశ్‌ కార్తీక్‌ వన్ హ్యాండెడ్ క్యాచ్‌.. అతనికి వయసయిపోయిందని ఎవరన్నారు? (వీడియో)!!

Dinesh Karthik One-Handed catch In Deodhar Trophy Final Sends Twitter Into A Frenzy

రాంచీ: టీమిండియా సీనియర్ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఫీల్డింగ్‌లో మరొకసారి సత్తాచాటాడు. దేవధార్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌-సి తరఫున ఆడుతున్న దినేశ్‌ కార్తీక్‌.. భారత్‌-బితో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో వన్ హ్యాండెడ్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. భారత్‌-బి ఆటగాడు పార్థీవ్‌ పటేల్‌ బ్యాట్‌ ఎడ్జ్‌కు తీసుకుని ఆఫ్‌ సైడ్‌ నుంచి వెళుతున్న బంతిని దినేశ్‌ కార్తీక్‌ గాల్లో డైవ్‌ చేసి మరి అందుకున్నాడు.

తొలి టీ20లో బంగ్లా విజయం.. టీమిండియా ఓటమికి 3 కారణాలు ఇవే!!తొలి టీ20లో బంగ్లా విజయం.. టీమిండియా ఓటమికి 3 కారణాలు ఇవే!!

ఇషాన్‌ పరోల్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌ చివరి బంతిని పార్థీవ్‌ పటేల్‌ షాట్ ఆడగా.. బంతి కాస్తా ఎడ్జ్‌ తీసుకుని వికెట్ల వెనకాలకు వెళుతోంది. బంతి ఫస్ట్‌ స్లిప్‌కు కాస్త ముందు పడేటట్లు ఉన్న తరుణంలో రెప్పపాటులో గాల్లోకి ఎగిరి క్యాచ్‌ ఒడిసిపట్టుకున్నాడు. దీంతో పార్థివ్ (14) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు దినేశ్‌ కార్తీప్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

'దినేశ్‌ కార్తీక్‌కు వయసు అయిపోయిందని ఎవరు అన్నారు' అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. 'సూపర్ క్యాచ్' అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. 'ఇప్పుడు చెప్పండి .. ఏమంటారు. కార్తీక్‌కు వయసు అయిపోయిదని చాలా మంది అంటున్నారు. ఇప్పటికీ పక్షిలా ఎగురుతూ క్యాచ్‌లు అందుకుంటున్నాడు. 2007లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టీవ్‌ స్మిత్‌ క్యాచ్‌ను ఎలా అందుకున్నాడో, ఇప్పుడు కూడా అదే తరహాలో పట్టుకున్నాడు' ఒక అభిమాని రాసుకోచ్చాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌-బి 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్‌ (54), కేదార్‌ జాదవ్‌ (86)లు హాఫ్‌ సెంచరీలు చేశారు. చివర్లో విజయ్‌ శంకర్‌ 33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌-సి ఆదిలోనే వికెట్‌ను కోల్పోయింది. శుభ్‌మన్‌ గిల్‌ (1) పూర్తిగా నిరాశపరిచాడు.

మయాంక్ అగర్వాల్ కూడా (28) కూడా తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. ప్రియామ్ గార్గ్ (74) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. దినేష్ కార్తీక్ (3), సూర్యకుమార్ యాదవ్ (3) పెవిలియా చేరారు. అక్షర్ పటేల్ (38) మాత్రం పోరాడుతున్నాడు. భారత్‌-సి విజయానికి 94 బంతుల్లో 119 పరుగులు చేయాలి.

Story first published: Monday, November 4, 2019, 15:33 [IST]
Other articles published on Nov 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X