న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్రియాన్ లారాతో అడింది కార్తీక్ కాక ఒక్కడే.. అశ్విన్ ఫన్నీ ఇంట్రడక్షన్.. నవ్వులే నవ్వుల్(వీడియో)

Dinesh Karthik ‘completely floored’ with Ashwin’s Intro for him during a interview

పోర్ట్‌ఆఫ్‌స్పెయిన్: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. ఐదు టీ20ల సిరీస్‌లో కూడా శుభారంభం చేసింది. శుక్రవారం బ్రియాన్ లారా స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని టీమిండియా 68 పరుగుల తేడాతో గెలుపొందింది. నయా హిట్టర్ దినేశ్ కార్తీక్ ఈ మ్యాచ్‌లోనూ తన జోరు కొనసాగించాడు. 19 బంతుల్లోనే 41 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ లక్ష్యాన్ని అందించాడు.

ఈ క్రమంలోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న కార్తీక్‌ను మ్యాచ్ అనంతరం రవిచంద్రన్ అశ్విన్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా కార్తీక్ గురించి చెబుతూ అశ్విన్ ఇచ్చిన ఇంట్రడక్షన్ అందర్ని ఆకట్టుకుంటుంది. కార్తీక్ సైతం ఈ ఇంట్రడక్షన్‌కు ఫిదా అయ్యాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకోగా వైరల్‌గా మారింది.

అసలు అశ్విన్ ఏం చెప్పాడంటే..?

అసలు అశ్విన్ ఏం చెప్పాడంటే..?

'ఇది బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియం. లారా 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆ కాలంలో లారాతో క్రికెట్ ఆడిన క్రికెటర్ భారత జట్టులో ఒకరే ఒకరున్నారు. బ్రియాన్ లారా స్టేడియంలో ఆడిన అతను ఇక్కడే ఉన్నాడు. అతనే దినేశ్ కార్తీక్. కార్తీక్ ఈ ఫీలింగ్ ఎలా ఉంది?' అని అశ్విన్ ప్రశ్నించాడు. దీనికి కార్తీక్ 'బాగుంది.. నీ ఇంట్రడక్షన్ ఆకట్టుకుంది. థ్యాంక్యూ'అంటూ నవ్వుతూ చెప్పాడు. దీనికి అశ్విన్ సైతం పడి పడి నవ్వాడు.

చాలా కూల్ టీమ్..

చాలా కూల్ టీమ్..

ప్రస్తుత టీమ్‌కు అప్పటి టీమ్‌కు ఉన్న తేడా ఏంటని ప్రశ్నించాడు. దీనికి కార్తీక్ ఇదో భిన్నమైన టీమ్..నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడు.'ఇది విభిన్నమైన టీమ్. ఈ సెటప్‌తో నేను ఎంజాయ్ చేస్తున్నా. కోచ్, కెప్టెన్ చాలా ప్రశాంతంగా జట్టును నడిపిస్తున్నారు. ఈ ఇద్దరికి చాలా క్రెడిట్ ఇవ్వాలి. ఆటగాళ్లకు అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. తప్పిదాలను కూడా సరైన మార్గం పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

ప్రపంచకప్ గెలవడమే..

సత్తా ఉన్న ఆటగాళ్లకు అవకాశాలిస్తూ సరైన్ టీమ్ ఎంపిక చేసే పనిలో ఉన్నారు. ఇంతకు ముందు ఇది మిస్సయ్యింది. మనమిద్దరం(అశ్విన్‌తో) విభిన్నమైన జట్లలో ఆడే ఇక్కడికి వచ్చాం. నీకు తెలుసు ఆ ప్రయాణం ఎలా ఉండేదో. ఈ విజయాలు సాధారణమైనవే. అంతిమ లక్ష్యం ప్రపంచకప్ గెలవడమే. ఆ టోర్నీ గెలవడంలో మనమిద్దరం కీలక పాత్ర పోషిస్తామని ఆశిస్తున్నా.'అని కార్తీక్ చెప్పుకొచ్చాడు.

రోహిత్ హాఫ్ సెంచరీ..

రోహిత్ హాఫ్ సెంచరీ..

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 190 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(44 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' దినేశ్‌ కార్తీక్‌ (19 బంతుల్లో 41 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. అనంతరం భారత బౌలర్ల సమష్టి ప్రదర్శనకు విండీస్‌ విలవిల్లాడింది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులే చేసింది. బ్రూక్స్‌ (20) టాప్‌ స్కోరర్‌ కాగా... అర్ష్‌దీప్, అశ్విన్, బిష్ణోయ్‌ తలో 2 వికెట్లు తీశారు.

Story first published: Saturday, July 30, 2022, 16:18 [IST]
Other articles published on Jul 30, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X