న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బాల్ ట్యాంపరింగ్: ఐసీసీకి అప్పీలు చేసుకున్న దినేశ్ చండీమాల్

Dinesh Chandimal appeals against match referees findings

హైదరాబాద్: వెస్టిండీస్‌తో గత సోమవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో బాల్ టాంపరింగ్‌కి పాల్పడి సస్పెన్షన్‌కి గురైన శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్‌ గురువారం శిక్షపై అప్పీల్ చేసుకున్నాడు. గత గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో రెండో రోజైన శుక్రవారం దినేశ్ చండిమాల్‌ బంతి ఆకారాన్ని మార్చినట్లు ఫీల్డ్ అంపైర్లు గుర్తించారు. దీంతో.. ఆరోజే చండిమాల్‌పై బాల్ టాంపరింగ్ అభియోగాలు నమోదవగా.. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ విచారణ జరిపిన అనంతరం శ్రీలంక కెప్టెన్‌పై ఐసీసీ ఒక టెస్టు మ్యాచ్‌ సస్పెన్షన్ వేటు వేసింది.

ఐసీసీ నియమావళి 41.3 ప్రకారం..:

ఐసీసీ నియమావళి 41.3 ప్రకారం..:

ఐసీసీ నియమావళి 41.3 ప్రకారం.. బంతి ఆకారం మార్చేందుకు సొంతంగా పాల్పడితే.. వారికి రెండు సస్పెన్షన్ పాయింట్లు దాంతో పాటు మ్యాచ్ ఫీజులో 100శాతం కోత విధించబడుతుంది. ఈ రెండు సస్పెన్షన్ పాయింట్లు.. రెండు వన్డేలు లేదా.. రెండు టీ 20లలో సస్పెండ్ చేయడంతో సమానం. ఈ క్రమంలోనే డే అండ్ నైట్ బార్బాడోస్ టెస్టు మ్యాచ్‌లో నిషేదానికి గురైయ్యాడు.

మూడో టెస్టు మ్యాచ్‌కి చండిమాల్ దూరం

దీంతో.. వెస్టిండీస్‌తో శనివారం నుంచి జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌కి చండిమాల్ దూరం కానున్నాడు. కానీ.. ఈ శిక్షపై తాజాగా చండిమాల్ అప్పీల్ చేసుకున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ‘బాల్ టాంపరింగ్‌తో ఒక టెస్టు మ్యాచ్‌ సస్పెన్షన్‌కి గురైన దినేశ్ చండిమాల్ అప్పీల్ చేసుకున్నాడు' అని ఐసీసీ ప్రకటించింది.

ఐసీసీ ఓ ప్రత్యేక జ్యుడిషియల్ కమీషనర్‌ని

ఐసీసీ ఓ ప్రత్యేక జ్యుడిషియల్ కమీషనర్‌ని

తాజా అప్పీల్‌తో విచారణ కోసం ఐసీసీ ఓ ప్రత్యేక జ్యుడిషియల్ కమీషనర్‌ని నియమిస్తే చండిమాల్‌పై టెస్టు సస్పెన్షన్‌ తొలగిపోయి మూడో టెస్టు ఆడేందుకు మార్గం సుగమంకానుంది. ఎప్పుడైతే బంతి ఆకారం మారిందని అనుమానం వచ్చిందో.. ఫీల్డ్ అంపైర్లు అలీం దర్, అయాన్ గౌల్డ్ థర్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్ బొరోను సంప్రదించారు.

 చండీమాల్ నోటి ఉమ్మితో.. బంతిపై

చండీమాల్ నోటి ఉమ్మితో.. బంతిపై

దీనిపై పరిశీలన జరిపిన అనంతరం దినేశ్ చండీమాల్ నోటి ఉమ్మితో.. బంతిపై రుద్దినట్లు స్ఫష్టమైంది. ఇలా చేయడం ఐసీసీ ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకం కావడంతో అతనిని మ్యాచ్ నుంచి నిషేదించామని మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ వెల్లడించారు.

Story first published: Thursday, June 21, 2018, 17:47 [IST]
Other articles published on Jun 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X