న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'టీమిండియా ప్రదర్శన అమోఘం.. అద్భుతం'

India vs Australia : India Dominant Show In Aus, Former Cricketers Hails Indian Cricket Team
Dilip Vengsarkar, Praveen Amre hail India for dominant show Down Under

ముంబై: ఆస్ట్రేలియాతో తలపడుతోన్న టీమిండియా నాలుగో టెస్టులో ముగింపు దశకు వచ్చేసింది. చివరి టెస్టు ఆఖరిరోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా కేవలం ఆరు పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 300 పరుగులు మాత్రమే చేయడంతో టీమిండియా 322 పరుగుల ఆధిక్యం లభించినట్లు అయింది. ఆస్ట్రేలియాలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న టీమిండియాను మాజీ క్రికెటర్లు దిలీప్‌ వెంగ్‌సర్కార్‌, ప్రవీణ్‌ ఆమ్రే ప్రశంసించారు. అంతేకాకుండా, చరిత్ర సృష్టించబోతున్న కోహ్లీసేనను అభినందించారు.

 బ్రాడ్‌మన్‌ సేనతో పోరాడిన టీమిండియా

బ్రాడ్‌మన్‌ సేనతో పోరాడిన టీమిండియా

సిరీస్‌లో భారత్‌ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరిదైన సిడ్నీలో విజయం దిశగా పయనిస్తోంది. ఆస్ట్రేలియాతో 1948లో లాలా అమర్‌నాథ్‌ నేతృత్వంలో భారత్‌ తొలిసారి ఆస్ట్రేలియా పర్యటించింది. అప్పటి టీమిండియా బ్రాడ్‌మన్‌ సేనతో పోరాడింది. ఆసీస్‌ సొంతగడ్డపై భారత్‌ తొలిసారి ద్వైపాక్షిక సిరీస్‌ కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి.

అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో బుమ్రా

అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో బుమ్రా

టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ చక్కని క్రికెట్‌ ఆడుతోంది. ఆస్ట్రేలియాను దాని సొంతగడ్డపై ఓడించడం చాలా పెద్ద విజయం. అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఆడే జట్లకు ఆసీస్‌ చాలా కఠినమైన జట్టుగా కనిపిస్తోంది. విరాట్‌ సేనకు ఇది ప్రత్యేకమైన గుర్తింపు. అక్కడి కఠిన పరిస్థితులను టీమిండియా అలవాటు చేసుకుని నిలబడింది. ప్రతి జట్టు విదేశాల్లో ఎలా ఆడుతుందో అనే విషయంపై రేటింగ్‌ ఇస్తారు. ఈ విషయంలో కోహ్లీసేన అందరినీ గర్వపడేలా చేసింది. బుమ్రా ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్లలో ఒకడు. అతనో పరిపూర్ణ బౌలర్‌.

 ఆత్మవిశ్వాసం, ఓపిక ఎంత ముఖ్యమో నిరూపించి

ఆత్మవిశ్వాసం, ఓపిక ఎంత ముఖ్యమో నిరూపించి

‘ప్రతి సిరీస్‌లోనూ తొలి టెస్టు చాలా కీలకమైనది. టీమిండియా శుభారంభాన్ని నమోదు చేసింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా తిరిగి పుంజుకోవడంతో సిరీస్‌ కఠినంగా మారింది. మూడో మ్యాచ్‌ అత్యంత కీలకమైనది. సిరీస్‌ గెలవాలంటే జట్టుగా కష్టపడాలి. బ్యాటింగ్‌ బృందం, బౌలింగ్‌ బృందంగా ఆడింది. టీమిండియా ప్రదర్శన అద్భుతమైనది అనూహ్యంగా అదరగొట్టింది. బుమ్రాకు హాట్సాఫ్‌. భారత్‌కు పటిష్ఠ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగి ఉంది. నేనైతే ఒక్కటే సెంచరీ చేశా. పుజారా మాత్రం అదరగొట్టాడు. ఆత్మవిశ్వాసం, ఓపిక ఎంత ముఖ్యమో అతడు మరోసారి నిరూపించి సత్తా చాటాడు.

Story first published: Sunday, January 6, 2019, 17:15 [IST]
Other articles published on Jan 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X