న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్ జట్టులో రహానే ఉండాలి: వెంగ్ సర్కార్

Ajinkya Rahane Should Be Included In The World Cup Squad Says Dilip Vengsarkar | Oneindia Telugu
Dilip Vengsarkar bats for Ajinkya Rahane’s inclusion in World Cup squad

హైదరాబాద్: ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ అజ్యింకె రహానేకు జట్టులో చోటు కల్పించాలని మాజీ కెప్టెన్ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అంటున్నారు. గత కొంతకాలంగా టీమిండియాలో నాలుగో స్థానం కోసం జట్టు మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, చివరకు ఆ స్థానానికి అంబటి రాయుడు చక్కగా సరిపోతాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ కితాబిచ్చాడు. అంతేకాదు నాలుగో స్థానం కోసం రేసులో రాయుడు ముందంజలో ఉన్నాడు.

ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫ్యాన్ గైడ్: ఎక్కడ, ఎప్పుడు, ఎలా?ఐసీసీ వరల్డ్ కప్ 2019 ఫ్యాన్ గైడ్: ఎక్కడ, ఎప్పుడు, ఎలా?

అయితే, వరల్డ్‌కప్ ఇంగ్లాండ్‌లో జరుగుతుంది కాబట్టి అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న రహానేను ఎంపిక చేయాలని వెంగీ సూచించాడు. "రహానేను ప్రతి మ్యాచ్‌లో ఆడించాలని నేనేమీ చెప్పడం లేదు. అక్కడి పరిస్థితులపై అవగాహన ఉండి బాగా ఆడగల బ్యాట్స్‌మన్‌ జట్టుకు అవసరం. రహానే అందుకు సరిపోతాడు. అతడిని ఏ స్థానంలోనైనా ఆడించొచ్చు. ఇక జడేజా బదులు విజయ్ శంకర్‌ బాగుంటాడు. కేదార్‌ జాదవ్‌ ఉంటాడు కాబట్టి మరో స్పిన్నర్‌ అవసరం లేదు" అని చెప్పుకొచ్చాడు.

ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌ ఇంగ్లాండ్‌లో మే 30 నుంచి జులై 14 వరకు జరగనుంది. టోర్నీలో భాగంగా మే 30, 2019న ఆతిథ్య ఇంగ్లాండ్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రౌండ్ రాబిన్ విధానంలో జరిగే 2019 వన్డే వరల్డ్ కప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి.

రౌండ్ రాబిన్ అంటే 1992 వరల్డ్‌కప్‌లో మాదిరిగా ఒక టీమ్ మిగతా అన్ని టీమ్స్‌తో ఆడాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌లోని మొత్తం పది నగరాల్లోని 11 వేదికలపై మ్యాచ్‌లను నిర్వహకులు నిర్వహించనున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమివ్వనుంది.

Story first published: Wednesday, February 6, 2019, 10:25 [IST]
Other articles published on Feb 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X