న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓటమి బాధను భరించడానికి ఇష్టపడలేదు.. ఓడిపోయుంటే బ్యాట్ పట్టకపోదును

Didnt want to feel the pain and regret of losing another final says Jos Buttler

ఇతర జట్టు టైటిల్‌ అందుకుంటుంటే చూస్తూ ఉండటం ఎంత బాధగా ఉంటుందో తెలుసు. ఆ బాధను మాటల్లో చెప్పలేను. ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ ఓటమి బాధను భరించడానికి మరలా ఇష్టపడలేదు అని ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌, వైస్ కెప్టెన్ జోస్‌ బట్లర్‌ తెలిపారు. న్యూజీలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచి తొలిసారి ప్రపంచకప్‌ను అందుకుంది.

ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌-7 ప్రత్యేక వార్తల కోసం

ఓటమి బాధను భరించలేను:

ఓటమి బాధను భరించలేను:

తాజాగా వైస్ కెప్టెన్ జోస్‌ బట్లర్‌ ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన మనసులోని మాటలను పంచుకున్నాడు. 'ప్రపంచకప్‌ ఫైనల్‌కు ముందు 8 ఫైనల్‌ మ్యాచ్‌లు ఆడాను. 7 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయాం. ఇందులో ఇంగ్లండ్‌ తరఫున ఛాంపియన్స్‌ ట్రోఫీ-2013, టీ20 ప్రపంచకప్‌-2016 ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. ఇతర జట్టు టైటిల్‌ అందుకుంటుంటే చూస్తూ ఉండటం ఎంత బాధగా ఉంటుందో తెలుసు. ఆ బాధను మాటల్లో చెప్పలేను. మరోసారి ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచ్ ఓటమి బాధను భరించడానికి ఇష్టపడలేదు' అని బట్లర్‌ అన్నారు.

బ్యాట్‌ కూడా పట్టుకోలేకపోదును:

బ్యాట్‌ కూడా పట్టుకోలేకపోదును:

'ఓడిపోతే నన్ను భయపెట్టేది ఏమిటంటే.. నేను మళ్ళీ క్రికెట్ ఎలా ఆడుతానో నాకు తెలియదు. జీవితంలో ఒక్కసారి మాత్రమే ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడే అవకాశం వస్తుంది. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని ఎంత అనుకున్నా. ఒకవేళ ఓటమి ఎదురైతే మాత్రం తట్టుకోలేకపోయేవాడిని. చాలా రోజుల వరకు బ్యాట్‌ కూడా పట్టుకోలేకపోదును' అని బట్లర్ పేర్కొన్నారు.

జరగకూడనిది జరిగితేనే:

జరగకూడనిది జరిగితేనే:

'జట్టును గెలిపించే ప్రదర్శన చేస్తానని తెలుసు. కానీ ఏదైనా జరగకూడనిది జరిగితేనే ఎలా? అనే సందేహమే నన్ను తీవ్రంగా వేధించింది. భారత్ మ్యాచ్ ముందు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాం. ఫేవరేట్‌గా దిగిన తమ జట్టుపై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంగ్లండ్ సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకుంటుందా? లేదా? అనే సందిగ్ధం కలిగింది. అభిమానులు ఎలా స్పందిస్తారో అని బయమేసింది. బెయిర్‌స్టో గాయం కూడా భయపెట్టింది. చివరకు కప్ సాధించాం. సంతోషంగా ఉంది' అని బట్లర్ చెప్పుకొచ్చారు.

Story first published: Monday, July 22, 2019, 16:38 [IST]
Other articles published on Jul 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X