న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ధోనీని ఎంపిక చేస్తారనుకోలేదు: గంగూలీ

Didnt expect MS Dhoni to be picked for SA T20s says Sourav Ganguly

న్యూఢిల్లీ: సొంత గడ్డపై త్వరలో జరిగే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఎంపిక చేస్తారనుకోలేదు. ధోనీని ఎంపిక చేయకపోవడం తనను ఆశ్చర్యపరచలేదని మరో మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. భవిష్యత్‌ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకుని ధోనీ ఈ సిరీస్ కోసం అందుబాటులో లేకపోవడంతో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ జట్టులోకి ఎంపికయ్యాడు. ప్రస్తుతం ధోనీ అమెరికాలో ఉన్నాడు.

'మా బ్యాట్స్‌మెన్ మళ్లీ నిరాశపరిచారు.. ఇంత చెత్తగా బ్యాటింగ్ చేస్తారనుకోలేదు''మా బ్యాట్స్‌మెన్ మళ్లీ నిరాశపరిచారు.. ఇంత చెత్తగా బ్యాటింగ్ చేస్తారనుకోలేదు'

పంత్‌కు అవకాశాలు ఇవ్వాలి:

పంత్‌కు అవకాశాలు ఇవ్వాలి:

శనివారం గంగూలీ మాట్లాడుతూ... 'దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కోసం ధోనీని ఎంపిక చేస్తారనుకోలేదు. ధోనీని ఎంపిక చేయకపోవడం తనను ఆశ్చర్యపరచలేదు. పంత్‌ను ఎంపిక చేసి జట్టు మేనేజ్‌మెంట్ సరైన నిర్ణయం తీసుకుంది. పంత్‌కు వీలైనన్ని అవకాశాలు ఇవ్వాలని నా అభిప్రాయం. ఒకవేళ విరాట్, జట్టు మేనేజ్‌మెంట్ ఆడాలని కోరితే ధోనీ మళ్లీ వచ్చే అవకాశముంది' అని పేర్కొన్నారు. 'కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను విడుదల చేస్తే.. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ తరపున తీసుకునేందుకు మేము సిద్ధంగా ఉన్నాం' అని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మెంటార్ గంగూలీ తెలిపారు.

మాకే ధోనీ సమయం ఇచ్చాడు:

మాకే ధోనీ సమయం ఇచ్చాడు:

ఈ సిరీస్‌కు ధోనిని పక్కక పెట్టడంతో విమర్శలు జోరందుకున్నాయి. అసలు ఎంఎస్‌ను కావాలనే తప్పించారా.. లేక అతనే తప్పుకున్నాడా అనే దానిపై విపరీతమైన చర్చ నడిసింది. దీనిపై సెలక్షన్‌ కమిటీ సభ్యుడొకరు స్పందించారు. 'ధోనీ లాంటి గొప్ప ఆటగాడిని మేము పక్కకు పెట్టలేం. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలు అందించిన ధోనీని కావాలని తప్పించలేదు. అతనే తప్పుకున్నాడు. ధోనీనే మాకు టైమ్‌ ఇచ్చాడు. వచ్చే టీ20 వరల్డ్‌కప్‌ నాటికి జట్టు సన్నాహకాల్లో భాగంగా ధోనీ విశ్రాంతి తీసుకుంటున్నాడు. యువ క‍్రికెటర్లతో జట్టును పరీక్షించమని మాకే ధోనీ సమయం ఇచ్చాడు. జట్టు ప్రయోజనాలే ధోనీకి ముఖ్యం' అని అన్నారు.

అంబులెన్స్‌లో కివీస్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?

సరైన ప్రత్యామ్నాయ కీపర్‌ లేడు:

సరైన ప్రత్యామ్నాయ కీపర్‌ లేడు:

'పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో పంత్‌కు గాయమైతే సరైన ప్రత్యామ్నాయ కీపర్‌ లేడు. అందుకే ధోనీ స్వయంగా తప్పుకున్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌ తర్వాత అతడి పాత్ర ఏమిటనే విషయంలో ఇంకా చర్చించలేదు. అయితే భవిష్యత్‌ ప్రణాళికలపై దృష్టి పెట్టాల్సిందిగా అతనే మాకు సలహా ఇచ్చాడు. ధోనీ లాంటి ఫినిషర్‌ కూడా మనకు లేడు. 350 వన్డేలు, 98 టీ20లు ఆడిన ఆటగాడిని చాలా తేలిగ్గా విమర్శిస్తున్నారు' అని ఆ అధికారి పేర్కొన్నారు.

Story first published: Sunday, September 1, 2019, 17:58 [IST]
Other articles published on Sep 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X