న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంబులెన్స్‌లో కివీస్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?

New Zealand team bus breaks down in Sri Lanka hills, after use ambulance and army jeep

పల్లెకెలె: ప్రస్తుతం న్యూజిలాండ్ క్రికెట్ జట్టు శ్రీలంక పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను న్యూజిలాండ్ ఇన్నింగ్స్ తేడాతో గెలిచి 1-1తో సమం చేసింది. దీంతో ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇరు జట్లకు 60 పాయింట్లు లభించాయి. ఇక రెండు జట్లు ఆదివారం ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌పై దృష్టి పెట్టాయి.

ఐపీఎల్ వేతన వివరాలను వెల్లడించిన బీసీసీఐ.. జవగల్‌ శ్రీనాథ్‌కు ఎంతో తెలుసా!!ఐపీఎల్ వేతన వివరాలను వెల్లడించిన బీసీసీఐ.. జవగల్‌ శ్రీనాథ్‌కు ఎంతో తెలుసా!!

 క్యాండీకి ప్రత్యేక బస్సులో:

క్యాండీకి ప్రత్యేక బస్సులో:

అయితే టెస్ట్ సిరీస్ అనంతరం టీ20 సిరీస్‌కు కొంత సమయం ఉండంతో కివీస్ క్రికెటర్లు, సిబ్బంది లంక అందాలను చూడాలనుకున్నారు. అందులో భాగంగా అందరూ ప్రముఖ పర్యాటక స్థలం క్యాండీకి ప్రత్యేక బస్సులో వెళ్లారు. అక్కడి అందాలను కివీస్ ఆటగాళ్లు, సిబ్బంది వీక్షించి తెగ ఎంజాయ్ చేశారు. ఇక తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న ప్రత్యేక లగ్జరీ బస్సు క్లచ్ విరిగిపోవడంతో అక్కడే నిలిచిపోయింది. దీంతో అందరూ అక్కడే నిరీక్షించారు.

ఓ తీపి గుర్తు:

అయితే ఆటగాళ్లను, సిబ్బందిని ఎలాగైనా హోటల్‌కు చేర్చాలనే ఉద్దేశంతో లంక అధికారులు అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వాహనాలను ఉపయోగించారు. చివరకు అంబులెన్స్‌లను కూడా లంక బోర్డు అధికారులు వాడారు. అంతేకాదు ఆర్మీ వాహనాలకు కూడా ఉపయోగించడంతో అందరూ హోటల్‌కు చేరుకున్నారు. ఈ ప్రయాణం సమీప భవిష్యత్తులో కూడా బ్లాక్ క్యాప్స్ మర్చిపోలేరు. ఇది వారికి ఓ మంచి తీపి గుర్తుగా నిలిచిపోనుంది.

అంబులెన్స్‌లో ఉన్నాం:

అంబులెన్స్‌లో ఉన్నాం:

దీనికి సంబందించిన ఓ వీడియోను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది. దీనిలో జట్టు మేనేజర్ మైక్ శాండిల్ వారు తమ గమ్యస్థానానికి ఎలా చేరుకున్నారో వివరించారు. 'మేము చాలా వాహనాలు ఉపయోగించుకున్నాము. మేము అంబులెన్స్‌లో ఉన్నాం. మా ముందు ఓ బస్సు ఉంది. వెనకాల కూడా ఆర్మీ జీపు సహా మరికొన్ని వాహనాలు ఉన్నాయి' అని శాండిల్ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Sunday, September 1, 2019, 16:13 [IST]
Other articles published on Sep 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X