న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టాస్ సమయంలో ప్రాక్సీ కెప్టెన్: డుప్లెసిస్‌పై తీవ్ర విమర్శ చేసిన గ్రేమ్‌స్మిత్

Didnt enjoy seeing that: Graeme Smith slams South Africa for using proxy captain at toss in Ranchi

హైదరాబాద్: రాంచీ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌ టాస్‌కు వెళ్లే క్రమంలో ప్రాక్సీ కెప్టెన్‌గా బావుమాను వెంట తీసుకురావడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం గ్రేమ్ స్మిత్ మండిపడ్డాడు. టాస్‌కు కెప్టెన్‌ హోదాలో మరొక క్రికెటర్‌ను తీసుకురావడం తమ ఆటగాళ్ల మైండ్‌సెట్‌కు అర్థం పడుతోందని విమర్శించాడు.

గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ "ఇది చమత్కారమైన క్షణం అయినప్పటికీ... చాలా దయనీయమైన అంశం. ఇది దక్షిణాఫ్రికా మైండ్ సెట్‌ను చూపిస్తుంది. ఈ విషయం నన్ను తీవ్ర నిరూత్సాహానికి గురి చేసింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ అక్కడ నిలబడి, తన స్థానంలో మరొకరిని నిలబెట్టి చూస్తున్నాడు" అని అన్నాడు.

Virat Kohli's DRS blunders: టెస్టు బ్యాట్స్‌మన్‌గా వరుసగా 9వసారి విఫలం!Virat Kohli's DRS blunders: టెస్టు బ్యాట్స్‌మన్‌గా వరుసగా 9వసారి విఫలం!

"గేమ్‌ ఓడిపోయినందుకు తప్పుడు కారణాలు వెతుక్కుంటున్నారు. మీ దురదృష్టం కొద్ది సరిగా ఆడలేదు. దాంతో సిరీస్‌ కోల్పోయారు. అవును, ఉపఖండలో టాస్‌ది కీలక పాత్రే.. అది ఒప్పుకోవాల్సిన విషయం. కానీ నువ్వు బాగా ఆడినప్పుడు ఈ తరహా సెంటిమెంట్‌తో అవసరం లేదు. పూర్తిస్థాయిలో ఆడండి" అని స్మిత్ పేర్కొన్నాడు.

విదేశాల్లో వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో డుప్లెసిస్‌ టాస్‌ కోల్పోవడంతో దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డుప్లెసిస్ వినూత్నంగా ఆలోచించాడు. టాస్‌కు తాను కాకుండా వేరే వాళ్లను తీసుకెళ్లాలని భావించి బావుమాను వెంట బెట్టుకుని వెళ్లాడు. అయితే, మూడో టెస్టులో కూడా టీమిండియానే టాస్ గెలిచింది.

రెండు నిమిషాలే షవర్‌ వాడుకోమన్నారు: డీన్ ఎల్గర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోకులురెండు నిమిషాలే షవర్‌ వాడుకోమన్నారు: డీన్ ఎల్గర్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోకులు

దీంతో బవుమా వెంట వచ్చిన డుప్లెసిస్‌ టాస్‌ రాత మారలేదు. కాగా, ఉపఖండంలో దక్షిణాఫ్రికా జట్టు టాస్‌ ఓడిపోవడం వరుసగా 10వసారి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ మెగ్‌ లానింగ్‌ ఇదే తరహాలో టాస్‌ సమయంలో అలిస్సా హీలేను వెంటబెట్టుకొచ్చి టాస్ గెలిచిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, October 19, 2019, 13:27 [IST]
Other articles published on Oct 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X