న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్.. ఇంటి దగ్గర అమ్మకి చెప్పే వచ్చావా: వసీం అక్రం

Asia Cup 2018 : Waseem Akram Memorises A Incident With Sacin Tendulkar
 Did you ask your mother before coming here? Akram once mocked a young Tendulkar

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్.. వసీం అక్రం ఉభయులు క్రికెట్ దిగ్గజాలే. వీరిద్దరి మధ్య పోరు కూడా ఇలానే భీకరంగా ఉండేది. తానొక్కొడే 100 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 200 టెస్టు మ్యాచ్‌లు ఆడిన సచిన్.. అదే అంతర్జాతీయ మ్యాచ్‌లలో 500 వన్డే వికెట్లు తీసిన బౌలర్‌గా అక్రమ్ నిలిచారు. ఇంతటి దిగ్గజాలు టెండూల్కర్.. అక్రం ఒకరికొకరు చక్కటి మర్యాదను పాటించేవారు. అలాంటి గతంలో వారిద్దరి మధ్య జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నాడు అక్రం.

 1989లో దాయాది జట్టు పాకిస్తాన్‌ దేశంలో

1989లో దాయాది జట్టు పాకిస్తాన్‌ దేశంలో

1984 నుంచి అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడుతూ స్థానాన్ని సుస్థిరం చేసుకున్న వసీం అక్రం బౌలర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే 16ఏళ్లు వయస్సున్నప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్‌లో తొలి విదేశీ పర్యటన చేశాడు. అదీ 1989లో దాయాది జట్టు పాకిస్తాన్‌ దేశంలో జరిగిన మ్యాచ్‌లకు అప్పటి భారత్ జట్టుతో బరిలోకి దిగాడు. ఓ టీనేజర్ క్రికెట్‌లో సంచలనంగా మారాడని.. ఆ ముంబై కుర్రాడు సచిన్‌యే నంటూ ప్రశంసలు కురుస్తుండటంతో అతనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సచిన్‌ను ఎదుర్కొనేందుకు వసీం అక్రం

సచిన్‌ను ఎదుర్కొనేందుకు వసీం అక్రం

ఈ క్రమంలో సచిన్‌ను ఎదుర్కొనేందుకు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రం, వఖర్ యూనిస్‌లు సిద్ధమైయ్యారు. కొన్నేళ్ల తర్వాత పాకిస్తాన్ ఎదుర్కొనేందుకు సచిన్ అలవాటుపడ్డాడు. కానీ, తొలినాళ్లలో సచిన్ మాత్రం తొలి విదేశీ పర్యటన నేపథ్యంలో కంగారుపడ్డాడట. ఆ సమయంలో సచిన్ బ్యాటింగ్ వస్తున్నాడట. అతనిని చూసిన అక్రం 'ఇంటి దగ్గర అమ్మకు చెప్పే వచ్చావా' అని అడిగాడట.

సలాం క్రికెట్‌లో దిగ్గజాలైన 11 మంది:

సలాం క్రికెట్‌లో దిగ్గజాలైన 11 మంది:

ఇటీవలే సలామ్ క్రికెట్ 2018 సందర్భంగా చెప్పుకొచ్చాడు అక్రం. బహుశా సచిన్ 16ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు పర్యటనకు వెళ్లినప్పటికీ చూడటానికి 14సంవత్సరాలు వయస్సున్నవాడిలానే కనిపించేవాడట. అప్పుడు ఆడిన సలాం క్రికెట్‌లో దిగ్గజాలైన వసీం అక్రం, సునీల్ గవాస్కర్, యూనిస్ ఖాన్, మిస్బా ఉల్ హక్, అబ్దుల్ ఖాదిర్, హర్భజన్ సింగ్, మొహమ్మద్ అజారుద్దీన్, ఆర్ అశ్విన్, హబీబుల్ బషార్, ముత్తయ్య మురళీధరన్, మదన్ లాల్‌లు ఉన్నారు.

తప్పు అయిపోయింది పాజీ

తప్పు అయిపోయింది పాజీ

ఇదే సందర్భంగా హర్భజన్ కూడా ఓ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో భజ్జీ బ్యాటింగ్ దిగాల్సి వచ్చిందట. ఆ సమయంలో బ్యాటింగ్ దిగేందుకు భజ్జీ చాలా ఆందోళనకు గురైయ్యాడట. 'వసీం భాయ్. నా హీరో. అతని బౌలింగ్‌లో బ్యాటింగ్ చేసేందుకు భయపడ్డా. కానీ, అతని బౌలింగ్‌లోనే ఫోర్ బౌండరీని బాదాను. దానికి వసీం అక్రం నన్ను 'తేరీ..'(నీ..) అని సంభోదించాడు. దానికి బదులుగా నేను 'తప్పు అయిపోయింది పాజీ' అని సమాధానమిచ్చాను.' అంటూ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, September 18, 2018, 11:39 [IST]
Other articles published on Sep 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X