న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

AUSvsSA: జీవితంలో ఇలాంటి పిచ్ చూడలేదు.. గబ్బాపై మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్

did not see a pitch as green says Ricky Ponting on the Gabba

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారిన విషయం గబ్బా పిచ్. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్ కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. ఈ పిచ్‌పై ఆడటం ఆటగాళ్ల భద్రతకు మంచిది కాదని సఫారీ సారధి డీన్ ఎల్గాన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి పిచ్‌లు చూసినప్పుడు అంపైర్లు కలగజేసుకోవాలని కూడా అన్నాడు. అయితే ఆసీస్ సారధి ప్యాట్ కమిన్స్ మాత్రం పిచ్ బాగానే ఉందంటూ గ్రౌండ్ స్టాఫ్‌ను వెనకేసుకొచ్చాడు.

ఫ్యాన్స్ ఆగ్రహం..

ఫ్యాన్స్ ఆగ్రహం..

మరో ఆసీస్ ప్లేయర్ మార్నస్ లబుషేన్ కూడా ఈ పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. 'ఇది టెస్టు క్రికెట్ ఆడే పిచ్ కాదు. ఇలాంటి పిచ్‌లు ఆటకు ఏమాత్రం మంచి చేయవు' అంటూ కఠినమైన కామెంట్స్ చేశాడు. క్రికెట్ అభిమానులు కూడా ఈ పిచ్‌పై మండి పడుతున్నారు. భారత్‌లో స్పిన్ పిచ్ తయారు చేస్తే క్రికెట్ నాశనమైపోయింది అనే బ్యాచ్ అంతా ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా లెజెండరీ కెప్టెన్ రికీ పాంటింగ్ కూడా గబ్బా పిచ్‌పై పెదవి విరిచాడు. ఐసీసీ నుంచి ఈ పిచ్‌కు కచ్చితంగా తక్కువ రేటింగ్ వస్తుందని అభిప్రాయపడ్డాడు.

 జీవితంలో ఇలాంటి పిచ్ చూడలేదు..

జీవితంలో ఇలాంటి పిచ్ చూడలేదు..

ఈ పిచ్ గురించి మాట్లాడిన పాంటింగ్.. 'నేను నా కెరీర్‌లో ఇంత పచ్చని పిచ్ చూడలేదు. అయితే నేను ఇక్కడ ఎక్కువ క్రికెట్ ఆడలేదు. కానీ మాథ్యూ హేడెన్ ఇక్కడ చాలా మ్యాచులు ఆడాడు. అతను కూడా తన జీవితంలో ఇంత పచ్చని పిచ్ చూడలేదన్నాడు. ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా తన కెరీర్‌లో ఇలాంటి పిచ్ చూడలేదని స్పష్టంగా చెప్పాడు. పిచ్ మీద అంత ఎక్కువ తేమ కూడా లేదు. మొదటి రోజు కొంత ఉండొచ్చు. గబ్బాలో అది సహజం. కానీ మనకు కనిపించిందేంటి? మరీ ఎక్కువ సీమ్ మూవ్‌మెంట్. దీనికి కచ్చితంగా చాలా తక్కువ రేటింగ్ వస్తుందని అనుకుంటున్నా' అని పాంటింగ్ అన్నాడు.

సఫారీల ఓటమి..

సఫారీల ఓటమి..

ఇక్కడ జరిగిన తొలి టెస్టులో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. తొలి ఇన్నింగ్సులో సౌతాఫ్రికా జట్టు కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. బదులుగా ఆస్ట్రేలియా 218 పరుగులు చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ మరీ ఎక్కువగా బౌలర్లకు సహకారం అందించింది. దీంతో సౌతాఫ్రికా జట్టు 99 పరుగులకే చాపచుట్టేసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ముందు 34 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆస్ట్రేలియా కూడా 4 వికెట్లు కోల్పోవడం గమనార్హం. రెండ్రోజుల్లో ఇక్కడ ఏకంగా 34 వికెట్లు పడ్డాయి. ఈ పిచ్ ఏమాత్రం బాగలేదని, ఇదే విషయాన్ని అంపైర్ల దృష్టికి కూడా తీసుకెళ్లానని డీన్ ఎల్గార్ ఆ తర్వాత చెప్పాడు.

Story first published: Tuesday, December 20, 2022, 13:05 [IST]
Other articles published on Dec 20, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X