న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రెప్పపాటులో స్టంపింగ్‌.. అచ్చం ధోనీలానే ధ్రువ్‌ జురెల్‌ (వీడియో)!!

Dhruv Jurel’s lightning fast stumping draws comparisons from MS Dhoni

పాచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా) : డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో అండర్‌-19 ప్రపంచకప్‌లో అడుగుపెట్టిన భారత్‌ ఫైనల్లో తడబడింది. మిడిలార్డర్‌ విఫలమవడంతో తొలుత తక్కువ స్కోరుకే పరిమితమైన టీమిండియా.. అనంతరం బౌలింగ్‌లో విజృంభించి బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేసినా బంగ్లా విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయింది. ఆదివారం స్నెవెస్‌ పార్క్‌లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి ప్రకారం 3 వికెట్ల తేడాతో గెలిచి తొలిసారి మెగా కప్పును సొంతం చేసుకుంది.

విజయానందంలో బంగ్లా ప్లేయర్ల ఓవరాక్షన్‌.. భారత ఆటగాడితో గొడవ!విజయానందంలో బంగ్లా ప్లేయర్ల ఓవరాక్షన్‌.. భారత ఆటగాడితో గొడవ!

రెప్పపాటులో స్టంపింగ్‌:

రెప్పపాటులో స్టంపింగ్‌:

ఫైనల్ మ్యాచ్‌లో భారత యువ వికెట్‌ కీపర్‌ ధ్రువ్‌ జురెల్‌ ఆకట్టుకున్నాడు. అద్భుత కీపింగ్ నైపుణ్యంతో టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీని తలపించాడు. భారత స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ వేసిన 17వ ఓవర్‌ మొదటి బంతిని బంగ్లా బ్యాట్స్‌మన్‌ షాదత్‌ హుస్సేన్‌ కాస్త ముందుకొచ్చి డిఫెండ్‌ చేసాడు. బంతి బ్యాటుకు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుంది. వెంటనే జురెల్‌ బంతిని అందుకొని రెప్పపాటులో స్టంపింగ్‌ చేశాడు. షాదత్‌ నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు.

మహీలా మేజిక్:

మహీలా మేజిక్:

ప్రస్తుతం ధ్రువ్‌ జురెల్‌కు సంబందించిన స్టంపింగ్‌ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పోస్ట్ చేసిన కొద్దినిమిషాల్లోనే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ సంపాదించింది. వీడియో చూసిన నెటిజన్లు తమదైన స్టయిల్లో కామెంట్లు చేస్తున్నారు. 'ధ్రువ్ జురెల్ గొప్ప గ్లోవ్ వర్క్' అని ఓ అభిమాని ట్వీట్ చేయగా.. 'మహీలా ధ్రువ్ జురెల్ మేజిక్ చేసాడు' అని మరో అభిమాని ట్వీటాడు.

ఆటకు వర్షం అంతరాయం:

ఆదివారం జరిగిన ఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (88) టాప్‌ స్కోరర్‌. తిలక్‌ వర్మ (38; 65 బంతుల్లో 3x4) రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ 42.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇమాన్‌ (47), కెప్టెన్‌ అక్బర్‌ అలీ (43) విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్‌ (4), సుశాంత్‌ మిశ్రా (2), జైశ్వాల్‌ (1) వికెట్‌ తీశారు. 41 ఓవర్లలో బంగ్లా 163/7తో ఉన్నప్పుడు వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. దీంతో లక్ష్యాన్ని 46 ఓవర్లలో 170 పరుగులుగా సవరించారు.

Story first published: Monday, February 10, 2020, 12:10 [IST]
Other articles published on Feb 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X