న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీధర్‌కు ధోనీ చేతుల మీదుగా దక్కిన అరుదైన గౌరవం

Dhoni pays tribute to M.V. Sridhar

హైదరాబాద్: బీసీసీఐ మాజీ జనరల్‌ మేనేజర్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) మాజీ కార్యదర్శి ఎంవీ శ్రీధర్‌కు గౌరవం దక్కింది. ఉప్పల్‌ స్టేడియం ప్రధాన ద్వారానికి హెచ్‌సీఏ.. శ్రీధర్‌ పేరు పెట్టింది. ఆదివారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ ధోని.. 'డాక్టర్‌ ఎంవీ శ్రీధర్‌ ఎంట్రన్స్‌'ను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. శ్రీధర్‌ తల్లి, భార్య.. హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేకానంద్‌, కోశాధికారి మహేంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ధోనీకి తగ్గని క్రేజ్:

ధోనీకి తగ్గని క్రేజ్:

టెస్టులకు గుడ్‌బై చెప్పినా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమైనా.. టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనిపై అభిమానం ఏమాత్రం తగ్గలేదు. ధోనిపై అభిమానంతో ఆదివారం ఉప్పల్‌ స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి స్టేడియంలో అభిమానుల సంఖ్య 23,778. అరగంటలోనే అభిమానుల సంఖ్య 30,888కు చేరుకుంది. కొద్దిసేపటికే ప్రేక్షకుల సంఖ్య 34,370కి పెరిగింది.

 వాతావరణం కూడా తోడై:

వాతావరణం కూడా తోడై:

స్టేడియం సింహభాగం పసుపు రంగు జెర్సీలతో నిండిపోయింది. ఉప్పల్‌ స్టేడియం సన్‌రైజర్స్‌ కంటే చెన్నైకే సొంతగడ్డలా అనిపించింది. గత కొన్ని రోజులుగా సూర్యప్రతాపం పెరిగిపోగా.. ప్రేక్షకుల కోసమా అన్నట్లు ఆదివారం వాతావరణం చల్లబడింది. సాయంత్రం 3 గంటల నుంచి ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోయింది. 4.30 గంటల తర్వాత ఎండ వచ్చింది.

4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను:

4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను:

చెన్నై చెలరేగింది. ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌ను బోల్తాకొట్టించింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 4 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' అంబటి రాయుడు, సురేశ్‌ రైనా 43 బంతుల్లో (54) నాటౌట్‌ అర్ధ సెంచరీలతో సత్తాచాటడంతో.. మొదట చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఆఖరి వరకు పోరాడిన సన్‌రైజర్స్‌ విజయానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

దీపక్‌ చాహర్‌ అద్భుతమైన బౌలింగ్‌తో (3/15):

దీపక్‌ చాహర్‌ అద్భుతమైన బౌలింగ్‌తో (3/15):

18వ ఓవర్ జరుగుతోండగా అవుట్ అయిన రాయుడు తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ క్రీజులోకి వచ్చాడు. రైనాతో కలిసి చక్కని భాగస్వామ్యాన్ని అందించిన ధోనీ 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. ధోనీ, రైనాలు మ్యాచ్ చివర్లో ఉండగా ఇన్నింగ్స్‌కు చక్కని ముగింపు పలికారు. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్‌ విలియమ్సన్‌ 51 బంతుల్లో (84), యూసుఫ్‌ పఠాన్‌ 27 బంతుల్లో(45) పోరాడినా ఫలితం లేకపోయింది. పేసర్‌ దీపక్‌ చాహర్‌ (3/15) అద్భుతమైన బౌలింగ్‌తో సన్‌రైజర్స్‌కు మ్యాచ్‌ను దూరం చేశాడు.

Story first published: Monday, April 23, 2018, 11:09 [IST]
Other articles published on Apr 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X