న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిగ్గు చేటు.. ధోనికి కాంట్రాక్ట్ ఇవ్వరా?: బీసీసీఐపై ఫ్యాన్స్ ఫైర్

'Where Is MS Dhoni? Fans Emotional After Thala Dropped From BCCI Contract || Oneindia Telugu
Dhoni Misses Out on BCCI Central Contract; What Does It Mean?

హైదరాబాద్: సీనియర్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకపోవడాన్ని అతని అభిమానులు తప్పుబడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. మూడు ప్రపంచకప్‌లు అందించిన దిగ్గజానికి సెంట్రల్ కాంట్రాక్టు దక్కకపోవడం సిగ్గు చేటని ఘాటుగా వ్యాఖ్యానిస్తున్నారు.

భారత్‌తో టీ20 సిరీస్‌.. భారీ హిట్టర్లకు చోటు.. న్యూజిలాండ్ జట్టు ఇదే!!భారత్‌తో టీ20 సిరీస్‌.. భారీ హిట్టర్లకు చోటు.. న్యూజిలాండ్ జట్టు ఇదే!!

దేనికి సంకేతం..

బీసీసీఐ తాజా నిర్ణయం ధోని కెరీర్ ముంగింపుకు సంకేతమా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

‘ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా తీసుకురాని వ్యక్తులు మూడు ట్రోఫీలను తెచ్చిన ధోనికి కాంట్రాక్టు ఇవ్వకపోవడం సిగ్గు చేటు. వెంటనే నిర్ణయాన్ని మార్చుకొని ధోనికి సెంట్రల్ కాంట్రాక్టు ఇవ్వండి. లేకుంటే మూల్యం చెల్లించుకుంటారు'అని ఒకరు కామెంట్ చేయగా.. ‘క్రికెట్‌లో మరోశకం ముగియనుందా? సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలిగించడం దేనికి సంకేతం?'అని మరొకరు ప్రశ్నించారు. చివరకు గ్రేడ్-సి కాంట్రాక్టును కూడా కేటాయించకపోవడం దారుణమని ఇంకొకరు మండిపడ్డారు.

గతేడాది ఎ-గ్రేడ్‌లో ఉన్న ధోని..

ఇక 2018-19 కాంట్రాక్టుల్లో ఏగ్రేడ్‌లో ఉన్న ధోనీకి ఈసారి ఎలాంటి కాంట్రాక్టు దక్కలేదు. వరల్డ్‌కప్ ఓటమి అనంతరం నుంచి ఆటకు దూరంగా ఉండటంతోనే బీసీసీఐ కాంట్రాక్టు ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే రి ఎంట్రీ ఇస్తాడని భావించిన అతని అభిమానులకు బీసీసీ నిర్ణయం మింగుడుపడటం లేదు.

ఐపీఎల్‌తో రీ ఎంట్రీ అనుకుంటే..

ఐపీఎల్‌తో రీ ఎంట్రీ అనుకుంటే..

ఐపీఎల్‌తో తమ అభిమాన క్రికెటర్ రీ ఎంట్రీ ఇస్తాడని వారంతా భావించారు. కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ధోని ఐపీఎల్ ఫామ్ అతని భవిష్యత్తుని నిర్ణయిస్తుందన్నారు. కానీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తొలగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అతని కెరీర్‌కు ముగింపుపలికే కార్యచరణనేనా అనే సందేహం కలుగుతోంది.

ఏ+ గ్రేడ్‌లో ఉన్నా ఆటగాళ్లకు రూ.7 కోట్లు

ఏ+ గ్రేడ్‌లో ఉన్నా ఆటగాళ్లకు రూ.7 కోట్లు

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఏ+ గ్రేడ్‌లో ఉన్నా ఆటగాళ్లకు రూ.7 కోట్ల వార్షిక వేతనం అందుతుండగా.. ఎ గ్రేడ్‌లో ఉన్న ప్లేయర్లకు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్‌లో ఉన్నవారికి రూ.3 కోట్లు, సీ గ్రేడ్‌లో ఉన్న క్రికెటర్లకు కోటీ రూపాయల జీతం వస్తోంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రిత్ బుమ్రా ఏ గ్రేడ్‌లో ఉండగా.. శ్రేయస్, నవ్‌దీప్ సైనీ, దీపక్ చహర్,మయాంక్, వాషింగ్టన్ సుంధర్‌లు కొత్తగా కాంట్రాక్టులు పొందారు.

Story first published: Thursday, January 16, 2020, 16:25 [IST]
Other articles published on Jan 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X