జూనియర్ ధోనిని పక్కకు తప్పించినా.. రాహుల్ అంతంత మాత్రంగానే

Posted By:
Dhoni fans trolling Rishabh Pant after India's loss

హైదరాబాద్: శ్రీలంక వేదికగా సోమవారం జరిగిన పొట్టి క్రికెట్‌లో భారత జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. నిదహాస్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండు టీ20ల్లోనూ చోటు దక్కించుకున్న రిషబ్ పంత్.. మూడో మ్యాచ్‌కు స్థానం పొందలేకపోయాడు. ఎట్టకేలకు భారత జట్టు విజయం సాధించడంతో మరో మ్యాచ్‌కు సైతం అతనిని దూరంగానే ఉంచుతారా అనే సందేహం నెలకొంది.

రాహుల్‌కి రోహిత్ శర్మ

రాహుల్‌కి రోహిత్ శర్మ

ముందు మ్యాచ్‌లలో అతని పేలవ ప్రదర్శన కారణంగానే తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అతనిని మూడో టీ20కు తీసుకోలేదని సమాచారం. దీంతో.. సోమవారం రాత్రి శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్‌లో అతడ్ని పక్కకి తప్పించి.. కేఎల్ రాహుల్‌కి కెప్టెన్ రోహిత్ శర్మ అవకాశం కల్పించాడు.

 ఏడాది తర్వాత దొరికిన అవకాశాన్ని పంత్

ఏడాది తర్వాత దొరికిన అవకాశాన్ని పంత్

ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి మహేంద్రసింగ్ ధోనీకి భారత సెలక్టర్లు విశ్రాంతినివ్వనున్నారని వార్త వెలువడగానే.. రిషబ్ పంత్‌కి అతని స్థానంలో చోటివ్వాలని చాలా మంది సూచించారు. ఇటీవల దేశవాళీ టోర్నీల్లో ఈ యువ క్రికెటర్ మెరుగ్గా రాణించడంతో.. సెలక్టర్లు కూడా అతనికే ఓటేశారు. కానీ.. దాదాపు ఏడాది తర్వాత దొరికిన అరుదైన అవకాశాన్ని రిషబ్ పంత్ చేజార్చుకున్నాడు.

పంత్ కాకపోతే రాహుల్:

పంత్ కాకపోతే రాహుల్:

సిరీస్‌లో ఫైనల్‌ కంటే ముందు ఒక మ్యాచ్ మాత్రమే (బంగ్లాదేశ్‌తో బుధవారం) మిగిలి ఉన్న నేపథ్యంలో.. మళ్లీ తుది జట్టులోకి పంత్ రావడం కష్టమనే చెప్పాలి. పోనీ, రిషబ్ పంత్ స్థానంలో వచ్చిన రాహుల్ అదిరిపోయే స్కోరు చేశాడా అంటే అదీ లేదు. పరుగు తీద్దామనే ఇంటెన్షన్‌తో ముందుకే చూసుకుంటూ తన వికెట్‌ను తానే తన్నేశాడు. సోమవారం రాత్రి మ్యాచ్‌లో రాహుల్ 18 పరుగులకే హిట్ వికెట్ రూపంలో ఔటైనప్పటికీ.. అతనికి మరో అవకాశం దక్కనుంది. ఒకవేళ అతనిపై వేటుపడితే.. దీపక్ హుడాకు ఆ ఛాన్స్ దక్కొచ్చు.

అతని పేలవ ప్రదర్శన సాగిందిలా:

అతని పేలవ ప్రదర్శన సాగిందిలా:

శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో 23 బంతుల్లో 23 పరుగులు చేసిన పంత్.. కీలక సమయంలో వికెట్ చేజార్చుకుని నిరాశపరిచాడు. అనంతరం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ఫుట్‌వర్క్‌తో బంతిని వికెట్లపైకి ఆడుకుని 7 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన కేఎల్‌ రాహుల్‌కి మార్గం సుగమమైంది.

Story first published: Tuesday, March 13, 2018, 14:40 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి