షమీ.. భార్యకు, దేశానికి ద్రోహానికి పాల్పడడు: ధోనీ

Posted By:
Dhoni defends Shami, speaks - is the best person, can not give the wife cheating

హైదరాబాద్: రోజుకో కొత్త ఆరోపణతో మీడియా ముందుకు వస్తోంది షమీ భార్య. ఈ విషయంలో తీవ్రంగా కుంగిపోయిన షమీ.. విషయం ఇంకా ముదిరిపోకుండానే పరిష్కారం కోసం కోర్టు బయట కలుద్దామని చెప్పాడు. అయినా విచారణ వేగవంతం కావడంతో పోలీసులు సైతం అప్రమత్తమై బీసీసీఐని సంప్రదించారు పోలీసులు. ఇదిలా ఉండగా షమీకి కాస్త ఊరట కలిగించే విషయం ఏమంటే ధోనీ అతనికి మద్దతుగా నిలిచాడు.

తనకు తెలిసి షమి అలాంటి వాడు కాదని ధోని అభిప్రాయపడ్డాడు. ''ఇది షమి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. దీనిపై నేను వ్యాఖ్యానించకూడదు. ఐతే నాకు తెలిసి షమి గొప్ప వ్యక్తి. అతను భార్య, దేశాన్ని వంచించడు'' అని ధోని అన్నాడు. షమి కెరీర్‌ ఎదుగుదలలో కెప్టెన్‌గా ధోని కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

షమి దుబాయ్‌కెందుకెళ్లాడు?: షమిపై అతడి భార్య పలు ఆరోపణలు చేస్తూ కేసులు పెట్టిన నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. తాను ఇంతకుముందే పెళ్లి చేసుకున్న పాకిస్థాన్‌ అమ్మాయిని కలవడానికి షమి ఇటీవలే దుబాయ్‌ వెళ్లినట్లు అతడి భార్య ఆరోపించిన నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన అనంతరం షమి దుబాయ్‌ వెళ్లడంపై సమాచారం ఉందా, దానికి సంబంధించి వివరాలు చెప్పాలని కోరుతూ పోలీసులు బీసీసీఐకి లేఖ రాశారు.

విషయం ఇలా వెలుగులోకి:
కారులో దాచి పెట్టిన షమీ మొబైల్‌ను పసిగట్టిన అతని భార్య ఆ సందేశాలను, ఫొటోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది. కొద్ది గంటల్లోనే అవి వైరల్ కావడంతో ఫేస్‌బుక్ వాటిని తొలగించింది. కానీ, ఆ విషయం అప్పటికే వెలుగులోకి రావడంతో షమీ భార్య మీడియా ముందుకొచ్చి తన ఆవేదనను వెల్లగక్కుతున్న సంగతి తెలిసిందే.

Story first published: Tuesday, March 13, 2018, 7:54 [IST]
Other articles published on Mar 13, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి