2019 ప్రపంచకప్‌కు రాయుడిని ఎంపిక చేయకపోవడం తప్పే: మాజీ సెలెక్టర్

Ambati Rayudu's Omission In The 2019 World Cup Was A Mistake - Devang Gandhi

ముంబై: 2019 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం తెలుగు తేజం అంబటి రాయుడుకి వచ్చినట్టే వచ్చి చేజారింది. ఆల్‌రౌండర్ (3డీ) అనే కారణంతో తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్‌కు జట్టులో స్థానం దక్కింది. టోర్నీ జరుగుతుండగా విజయ్ శంకర్, శిఖర్ ధావన్ గాయాలతో దూరమైనా.. రాయుడికి జట్టులో చోటు దక్కలేదు. రాయుడిని కాదని రిషబ్ పంత్‌ను ఇంగ్లండ్ పంపించారు. ఇక సెమీ ఫైనల్లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా కోహ్లీసేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే రాయుడుకి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోకపోవడానికి అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాదే కారణమని వార్తలు వచ్చాయి.

స్టార్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడును 2019 ప్రపంచకప్‌ జట్టు నుంచి తప్పించడం సరికాదని మాజీ భారత ఆటగాడు, సెలెక్టర్ దేవాంగ్ గాంధీ తాజాగా అంగీకరించారు. టీమిండియా నాలుగో స్థానంలో ఆడే సరైన ఆటగాడిని కనిపెట్టలేకపోయిందన్నారు. '2019 ప్రపంచకప్‌కు అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడం పొరపాటే. మేము కూడా మనుషులమే కాబట్టి కొన్ని తప్ప్పులు చేశాం. ఆ సమయంలో మేము సరైన కాంబినేషన్‌ను ఎంచుకున్నాం అని అనుకున్నాం. కానీ రాయుడు జట్టులో ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేదని టోర్నీ అనంతరం తెలిసింది' అని దేవాంగ్ గాంధీ అన్నారు.

అంబటి రాయుడు ఐపీఎల్ 2020లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కొన్ని అద్భుత ప్రదర్శనలు చేశాడని, ఆ సమయంలో 2019 ప్రపంచకప్‌ జట్టు నుంచి అతడిని తప్పించడం తప్పు అని మరోసారి విమర్శకులు భావించారని దేవాంగ్ గాంధీ పేర్కొన్నారు. 'వాస్తవానికి వన్డే ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్ మినహా టీమిండియా మెరుగ్గా ఆడింది. కానీ రాయుడిపై వేటు గురించే ఎక్కువ చర్చ నడిచింది. రాయుడి బాధని నేను అర్థం చేసుకోగలను. అతని అసహనంలోనూ న్యాయముంది' అని మాజీ సెలెక్టర్ దేవాంగ్ గాంధీ తెలిపారు.

2019 ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనైన అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే రాయుడుకి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోకపోవడానికి అప్పటి చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాదే కారణమని వార్తలు వచ్చాయి. అప్పటి వరకూ బ్యాటింగ్ ఆర్డర్ నెం.4లో రాయుడికి వరుసగా అవకాశాలిచ్చిన సెలెక్టర్లు.. వన్డే ప్రపంచకప్‌కి మాత్రం నెం.4 స్థానం కోసం విజయ్ శంకర్‌ని ఎంపిక చేశారు. రాయుడికి బదులుగా శంకర్‌ని ఎంపిక చేయడంపై అప్పట్లో ప్రసాద్ మాట్లాడుతూ.. 'విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు కోణాల్లో టీమ్‌కి ఉపయోగపడతాడు' అని వెల్లడించాడు.

India vs Australia: కోహ్లీకి 133 ప‌రుగులు.. చహ‌ల్‌కు 9 వికెట్లు!! ఊరిస్తున్న అరుదైన రికార్డులు!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, November 21, 2020, 18:09 [IST]
Other articles published on Nov 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X