న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ Vs కొలంబో: మీరే చూడండి... ఏ సిటీలో గాలి కాలుష్యం ఎక్కువో!

By Nageshwara Rao
Delhi vs Colombo: Check out which city is cleaner!

హైదరాబాద్: దేశ రాజధానిలోని కాలుష్యం తీవ్రత ఫిరోజా షా కోట్లా స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టుపై ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు, రెండో రోజైన ఆదివారం ఉదయం నుంచే పొగ మైదానాన్ని కమ్మేయగా.. మధ్యాహ్నానికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

ఆదివారం ఢిల్లీ టెస్టులో ఏం జరిగింది: లంక ఆటగాళ్లు కావాలనే మాస్క్‌లు ధరించారా?ఆదివారం ఢిల్లీ టెస్టులో ఏం జరిగింది: లంక ఆటగాళ్లు కావాలనే మాస్క్‌లు ధరించారా?

దీంతో శ్రీలంకకు చెందిన ఆటగాళ్లు ముఖాలకు మాస్కులు ధరించి ఆడారు. లంక క్రికెటర్లు తీరుని అటు మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. చివరి టెస్టులో ఓటమి నుంచి తప్పించుకునేందుకు శ్రీలంక క్రికెటర్లు కావాలనే నాటకీయ పరిణామాలకు తెరలేపారని వాదనలు కూడా వినిపించాయి.

లంక క్రికెటర్లు ముఖాలకు మాస్క్‌లు ధరించి ఫీల్డింగ్ చేయడంపై సోషల్ మీడియాలో జోకులు కూడా పేలాయి. దీంతో ఆ జట్టు కోచ్ నిక్‌ పాథస్‌ తమ క్రికెటర్లు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం నిజమేనని, జట్టులోని ఆటగాళ్లు సురంగ లక్మల్‌, లాహిరు గమాగె, ధనంజయ డిసిల్వా వాంతులు చేసుకున్నారని చెప్పాడు.

ఈ నేపథ్యంలో ఢిల్లీతో పోలిస్తే శ్రీలంక రాజధాని కొలంబో అంత క్లీన్‌గా ఉందా? అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు ఢిల్లీకి మంచి చక్కటి వాతావరణం నుంచి లంక ఆటగాళ్లు వచ్చారా? అని నెటిజన్లు తమదైన శైలిలో విరుచుకుపడ్డారు.

ముఖానికి మాస్క్‌లు: ట్విట్టర్‌లో జోకులు, గంగూలీ అసంతృప్తిముఖానికి మాస్క్‌లు: ట్విట్టర్‌లో జోకులు, గంగూలీ అసంతృప్తి

ఢిల్లీ టెస్టుతో రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం ఎక్కువ? లేక కొలంబోలో గాలి కాలుష్యం ఎక్కువ? అనే కొత్త వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ, కొలంబోలో గాలి కాలుష్యానికి సంబంధించిన వివరాలు మీ కోసం....


The numbers


Pollution Index: Delhi: 92.61; Colombo: 59.39

Pollution scale: Delhi: 168.61; Colombo: 102.81


Air Pollution Data (WHO)

Delhi (PM10): 229; Colombo: 64

Delhi (PM 2.5): 122; Colombo: 36


Pollution General Index


Air Pollution: Delhi: 88.93 (Very High). Colombo: 56.25 (Moderate).


Driniking Water: Delhi: 65.94 (High). Colombo: 35.71 (Low).


Dissatisfaction with garbage disposal: Delhi: 77.57 (High). Colombo: 50 (Moderate).


Dirty/Untidy: Delhi: 74.51. Colombo: 45.83 (Moderate).


Noise/Light Pollution: Delhi: 65.18 (High). Colombo: 54.17 (Moderate).


Water Pollution: Delhi: 79.75 (High). Colombo: 61.31 (High).


Purity and Cleanliness


Air Quality: Delhi: 11.07 (Very Low). Colombo: 43.75 (Moderate).


Drinking water quality: Delhi: 34.06 (Low). Colombo: 64.29 (High).


Water Quality: Delhi: 20.25 (Low). Colombo: 38.69 (Low).


(All figures December 2017).


తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 5, 2017, 13:24 [IST]
Other articles published on Dec 5, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X