న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఢిల్లీ డేర్ డెవిల్స్ కొత్త పదవిలో మొహమ్మద్ కైఫ్

Delhi Daredevils rejig Pravin Amres role, hire Mohammad Kaif

న్యూ ఢిల్లీ: ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ప్రఖ్యాత దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్‌లో దర్శనమివ్వనున్నాడు. మహ్మద్ కైఫ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీలో భాగం కానున్నాడు. గతంలో గుజరాత్ లయన్స్ కోసం పని చేసిన కైఫ్.. వచ్చే సీజన్లో ఢిల్లీకి సేవలు అందించనున్నాడు. అసిస్టెంట్ ప్రవీణ్ ఆమ్రేతో కలిసి టాలెంట్ స్కౌట్స్‌గా పని చేయనున్నాడు.

వీరిద్దరూ కలిసి ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను వెలుగులోకి తీసుకురానున్నారు. ఐపీఎల్ వేలం ప్రక్రియలో ఢిల్లీకి వీరి సేవలు కీలకం కానున్నాయి. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కైఫ్.. భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ జట్టులో మార్పులు చేస్తోంది. రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. ఇప్పటి వరకూ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ నెగ్గలేదు.

ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. 2018 సీజన్లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. దీంతో ఫ్రాంచైజీ పేరు మార్చే దిశగానూ యాజమాన్యం సీరియస్‌గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఐపీఎల్ సీజన్లో జట్టు నాయకత్వ లోపంతో సీజన్ ఆసాంతం పేలవ ప్రదర్శన కొనసాగించింది ఢిల్లీ డేర్ డెవిల్స్. వరుస వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ గౌతం గంభీర్ నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడం.

అతని స్థానంలో యువ క్రికెటర్ కెప్టెన్సీ వహించడంతో జట్టు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ప్రస్తుత కైఫ్ పదవి గురించి కూడా ఇప్పుడు నిర్దారణకు రాలేమని అధికారికంగా డిల్లీ డేర్ డేవిల్స్ సీఈవో హేమంత్ దువా ప్రకటించిన తర్వాతనే చెప్పగలమని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఏదనే విషయం ఐపీఎల్ వేలం నిర్దారించుకోవచ్చు.

Story first published: Saturday, October 20, 2018, 12:09 [IST]
Other articles published on Oct 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X